ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళతో రాత్రి గడపాలి..కరిష్మా కపూర్ సంచలనం
on Mar 13, 2024
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అశేష అభిమానాన్ని పొందింది. పైగా తను హిందీ చిత్రసీమని మకుటం లేని మహరాజులా ఏలిన రాజ్ కపూర్ మనవరాలు. తన నాన్న,బాబాయ్ పెదనాన్న ,అన్న ,తమ్ముడు ఇలా అందరు హీరోలే. నేటి యానిమల్ హీరో రణబీర్ కపూర్ కూడా ఈమెకి వరుసకి తమ్ముడే. తాజాగా ఆమె తన మాజీ భర్త గురించి చెప్పిన మాటలు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా హీట్ ని రాజేస్తున్నాయి.
కరిష్మా కపూర్ మాజీ భర్త పేరు సంజయ్ కపూర్. ఇతను ఒక పెద్ద బిజినెస్ మాన్. అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. తాజాగా కరిష్మా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు అప్పట్లో నా భర్త నన్ను వేలం వేశాడు. ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వారితో నేను ఒక రాత్రి గడపాలని చెప్పేవాడు. కానీ అలాంటి నీచమైన చర్యలకు పాల్పడనని అతని మీద సీరియస్ అయ్యేదాన్ని అని చెప్పింది.అలాగే నాతో పెళ్లి అయ్యాక కూడా తన మొదటి భార్యతో ఎఫైర్ ని కొనసాగించాడు. అతడి వేధింపులు భరించలేకే నేను విడాకులు ఇచ్చానంటూ చెప్పుకొచ్చింది.
కరిష్మా కి సంజయ్ కి 2003 లో వివాహం జరిగింది.అనంతరం 2016 లో విడిపోయారు. రాజా హిందూస్థానీ, శక్తీ, అ నారి, ఫిజా, హమ్ సాథ్, జుబైదా లాంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తన ఎంటైర్ సినీ కెరీర్లో సుమారు 61 చిత్రాలకి పైనే చేసింది. ఇక సంజయ్ కపూర్ సోనా BLW ప్రెసిషన్ సోనా కామ్‌స్టార్‌కు ఛైర్మన్‌గా ఉన్నాడు. ఎలక్ట్రిఫైడ్ మరియు నాన్ఎలక్ట్రిఫైడ్ పవర్‌ట్రైన్‌ల కోసం ఆటోమోటివ్ సిస్టమ్‌లు మరియు కాంపోనెంట్‌లను ఆ సంస్థ తయారు చేస్తుంది. ఇండియాతో సహా చైనా, మెక్సికో, యుఎస్‌లో తొమ్మిది ఫ్యాక్టరీలు ఉన్నాయి.
Also Read