Read more!

English | Telugu

కసి, ఆకలి ఎక్కువ అంటూ అవినాష్ పరువు తీసిన శ్రీముఖి


బుల్లితెర మీద యాంకర్ శ్రీముఖి హోస్టింగే వేరే లెవెల్. ఆమె ఎనెర్జీకి మ్యాచ్ అయ్యేవాళ్ళు ఎవరూ లేరు. ఆ రేంజ్ లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ ఐన "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ప్రోమోలో చూస్తే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి కొత్తగా స్టార్ట్ ఐన సీరియల్ "బ్రహ్మముడి" టీంతో పాటు "ఇంటింటి గృహలక్ష్మి " టీం కూడా వచ్చింది. ఈ ఎపిసోడ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ లు పిచ్చగా గుమ్మరించారు అందరూ. మరీ ముఖ్యంగా లేడీస్ మాట్లాడ్డం కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. గృహలక్ష్మి టీమ్ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చేసరికి "ఐ వాంట్ కసి" అని ఫైమా కసిగా అడిగింది "నీకు కసి కావాలి అంటే ఇంద్రనీల్ బాగా నేర్పిస్తారు" అని చెప్పింది లాస్య. దాంతో కస్తూరి ఇంద్రనీల్ ని వెనకేసుకొచ్చింది. "పసి బిడ్డను పట్టుకుని కసి నేర్పిస్తారని అంటారేమిటి" అని అడిగేసరికి " "ఏ యాంగిల్ లో మీకు పసి బిడ్డలా కనిపిస్తున్నాడు" అని శ్రీముఖి అడిగేసింది. 

కస్తూరి, ఇంద్రనీల్ కలిసి "బావవి నువ్వు భామను నేను" సాంగ్ కి డాన్స్ చేశారు. ఈ షోకి "మైకేల్" మూవీ నుంచి సందీప్ కిషన్ వచ్చి ఫైమాతో కలిసి డాన్స్ చేసాడు. శ్రీముఖి ఫైమా మీద ఫైర్ అయ్యింది "నీకు హీరోయిన్ అయ్యే లక్షణాలు అస్సలు లేవు.." అంది దాంతో సందీప్ కిషన్  వచ్చి "నీకు మాత్రం డైరెక్టర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి" అని శ్రీముఖికి కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. నవరసాలు పలికించే టాస్క్ ని శ్రీముఖి హమీదకి ఇచ్చింది. అవినాష్ కళ్లల్లోకి   చూస్తూ శృంగార రసం పలికించాలని చెప్పేసరికి అవినాష్ దొరికిందే ఛాన్స్ అనుకున్నాడు.  ఇంతలో మధ్యలోకి శ్రీముఖి వచ్చి "హమీదాకి శృంగారంలానే ఉంది..కానీ అవినాష్ కి మాత్రం కసి ప్లస్ ఆకలి లాగా ఉంది" అని అవినాష్ పరువు తీసేసింది.   తరువాత ఫైమా-అవినాష్‌ ఇద్దరికీ అదే శృంగార రసం కాన్సెప్ట్ ఇచ్చింది. ఫైమా అయితే తెగ రెచ్చిపోయింది. ఈ మధ్య కాలంలో బుల్లితెర షోస్ అన్నీ కూడా కొంచెం శృతిమించుతున్నాయి.