Read more!

English | Telugu

చిన్నప్పుడే పవన్ కళ్యాణ్ కి చుక్కలు చూపించిన రామ్ చరణ్!

అన్ స్టాపబుల్ షో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఆహా ఓటీటీ వేదికగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ షో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పుడు ఆహా మొత్తం పవర్ స్టార్ మేనియా కనిపిస్తోంది. ఈ షో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. పవన్ కళ్యాణ్ తో చేసిన ఎపిసోడ్ 1 లో జనసేనాని ఎన్నో విషయాలు చెప్పారు. ఇక రాంచరణ్ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. హోస్ట్ బాలయ్య తనని "బాలా" అని ముద్దుగా పిలిపించుకున్నారు.  చిన్నప్పుడు అంటే పవన్ టీనేజ్ లో ఉన్నప్పుడు చిరంజీవి, నాగబాబు సినిమాకి సంబంధించిన పనులు చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో పిల్లల్ని చూసే డ్యూటీ చేసినట్లు చెప్పారు.  ఇక పవన్ చేత రామ్ చరణ్ కి కాల్ చేయించారు బాలయ్య. రామ్ చరణ్ కాల్ లోకి వచ్చాక " మీ బాబాయి గురించి ఎవరికీ తెలీని ఒక సీక్రెట్ చెప్పు" అని అడిగేసరికి " బాబాయ్ లైఫ్ చాలా బోర్, పెద్దగా సీక్రెట్స్ అనేవి ఉండవు.  వారం మొత్తం హైదరాబాద్ బిర్యానీ పెట్టిన తింటారు అంత ఇష్టం" అని చెప్పాడు.

 "నువ్వు పవన్ దగ్గరే ఎక్కువగా పెరిగావట" అని బాలయ్య అడిగేసరికి "నిజం మా అమ్మ కన్నా బాబాయి చాలా స్ట్రిక్ట్.. బాబాయ్ చెప్పినవన్నీ ఫాలో అయ్యేవాడిని" అని చెప్పాడు రాంచరణ్. "మీరిద్దరూ కలిసి మీ నాన్నకు తెలియకుండా చేసిన ఒక అల్లరి పని చెప్పు" అని అడిగేసరికి పక్కనుంచి పవన్ హింట్ ఇచ్చారు "సింగపూర్ వెళ్ళినప్పుడు నేను ఎలా చూశానో అడగండి" అని చెప్పేసరికి బాలయ్య అదే అడిగారు " ఆ టైంలో నేను బాబాయ్ కి నరకం చూపించాను. మాతో అమ్మ లేదు కదా అని ఇష్టమొచ్చిన ఫుడ్ తినేసాను. చివరికి అక్కడ రోడ్ మీద వాంతి చేసేసుకున్న.. అది మొత్తం బాబాయ్ క్లీన్ చేసి హోటల్ కి తీసుకెళ్లి నన్ను ఫ్రెష్ గా చేశారు. అలా  ఆయన సింగపూర్ ట్రిప్‌ మొత్తాన్ని నేను నాశనం చేశాను’’ అని చెప్పుకొచ్చాడు చరణ్‌. ‘‘అప్పుడు నీ వయసెంతమ్మా’’ అని బాలకృష్ణ చరణ్‌ని అడిగేసరికి నాలుగైదేళ్ళ ఉంటాయని చెప్పారు పవన్ కళ్యాణ్. వెంటనే బాలయ్య.. ‘‘ఐదేళ్ల పిల్లాడిని చంకలో పెట్టుకుని సింగపూర్‌ వెకేషన్‌ వెళ్లడం ఏంటమ్మా’’అని సరదాగా ఆటపట్టించాడు.

 "మా నాన్నకు నా మీద బాగా విసుగొచ్చినప్పుడు బాబాయ్ దగ్గరకు పంపేవారు.ఆయన కొట్టేవారు కాదు కానీ గంటలు గంటలు మాట్లాడేవారు" అన్నాడు రాంచరణ్ .తర్వాత ఫోన్ మళ్ళీ పవన్ కి ఇచ్చేసి "మీ అబ్బాయికి అందరు ముందు చెప్పాలనుకున్నది చెప్పవా" అనేసరికి పవన్ సిగ్గుపడుతూ "ఓకే రా జాగ్రత్త బై" అని ఫోన్ పెట్టేసాడు. "ఇంత క్యూట్ ఫామిలీ ఏంటయ్యా బాబు మీది" అన్నారు బాలయ్య సరదాగా.