Read more!

English | Telugu

దసరా మూవీ అనుకున్నంత బాగా తియ్యలేదన్న నేచురల్ స్టార్ నాని

సుమ అడ్డా షో  నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "దసరా" మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. నాచురల్ స్టార్ నానిని స్పెషల్ గా ఇన్వైట్ చేసింది సుమ. "భర్త వస్తూ వస్తూ భార్య కోసం ఏం తెస్తాడు" అని అడిగేసరికి "కర్రీ పాయింట్ నుంచి కర్రీ" అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు నాని. "అంటే ఇప్పటివరకు మీరు మల్లెపువ్వులు తీసుకుని వెళ్లలేదా" అని అడిగింది సుమ " లేదు" అని చెప్పేసరికి "రాజీవ్ చూసి నేర్చుకోండి" అంది సుమ సెటైరికల్ గా.. "ఇప్పుడు క్రికెట్ జరుగుతుంది" అని సుమ అనౌన్స్ చేసేసరికి కాసర్ల శ్యాం దాని రూల్స్ చెప్పారు "లైట్ కి తగిలితే 6 అని సుమకి తగిలితే 4 " అని చెప్పేసరికి సుమ షాకయ్యింది. "తెలుగు ఇండస్ట్రీలో మీకసలు కాంపిటీషన్ వచ్చే హీరో లేడు" అని సుమ అడిగేసరికి "అవును... సక్సెస్ అనేది ఎవరితోనూ ఎక్కువ సేపు ఉండదు" అని చెప్పాడు నాని.

తర్వాత "దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గురించి చెప్పండి" అని నానిని అడిగేసరికి "శ్రీకాంత్ నేను అనుకున్నంత బాగా దసరా మూవీ తియ్యలేదు" అని చెప్పి డైరెక్టర్ కి షాకిచ్చాడు. శ్రీకాంత్ కూడా నాని వైపు ఒక లుక్ ఇచ్చాడు.  నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా మూవీ "దసరా"..  ఈ మూవీ మార్చి 30న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ మూవీ   సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది దసరా ముందే వచ్చేస్తోందంటూ ప్రొమోషన్స్ లో బాగా హైలైట్ చేస్తున్నారు మూవీ టీమ్.

నానితో పాటు కీర్తి సురేశ్ కూడా ప్రెస్ మీట్స్ కి వస్తూ ఈ మూవీ గురించి మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మరి నాని ఈ కొత్త డైరెక్టర్ గురించి సుమ అడ్డా షోలో అంత మాట అనేసాదేమిటి అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు అసలు నాని ఏమన్నాడు అనే విషయం తెలియాలంటే ఈ షో కోసం 25 వరకు వెయిట్ చేయాల్సిందే.