English | Telugu

'కార్తీకదీపం' రేటింగ్స్ తగ్గుతున్నాయ్! ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయ్‌!!

బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ అత్యధిక టీఆర్పీతో మిగ‌తా సీరియ‌ల్స్‌కు అంద‌నంత ఎత్తులో దూసుకుపోతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. గత మూడున్నరేళ్లుగా టాప్ రేటింగ్ తో మొదటి స్థానంలో ఉన్న ఈ సీరియల్ కు అస‌లు ఏదుర‌నేది లేకుండా పోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ సీరియ‌ల్ రేటింగ్స్ తగ్గుతుండ‌టం గ‌మ‌నార్హం. మోనిత ప్రెగ్నెంట్‌ అనే ట్విస్ట్ తో 21.01 టీఆర్పీ సాధించి రికార్డు క్రియేట్ చేసింది 'కార్తీక‌దీపం'. అయితే ఈ ట్విస్ట్ తరువాత సీరియల్లో పస తగ్గిందనే అభిప్రాయం వీక్ష‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో రేటింగ్స్ తగ్గుతూ వస్తున్నాయి.

జూన్ నెల 5 నుండి 11 వరకు చూసుకుంటే ఈ సీరియల్ 19.10 రేటింగ్ సంపాదించింది. జూన్ 12-18 మధ్య 18.86 రేటింగ్, ఆ తర్వాత జూన్ 19-25 మధ్య 18.25 రేటింగ్ సాధించింది. ఇది చూస్తే గనుక వారం, వారానికి రేటింగ్ తగ్గుతూ వస్తోంది. టీఆర్పీ తగ్గుతున్నప్పటికీ.. ఫస్ట్ ప్లేస్ మాత్రం 'కార్తీకదీపం' సీరియల్‌దే.

ప్రస్తుతం 'కార్తీకదీపం' సీరియల్ 18.24 రేటింగ్‌తో తొలిస్థానంలో ఉండగా.. 'గృహలక్ష్మి' 12. 92 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. కొత్త సీరియల్ 'గుప్పెడంత మనసు' 11.89 రేటింగ్‌తో అనూహ్యంగా మూడో స్థానంలో నిలవగా.. 'జానకి కలగనలేదు' 9.35 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉంది. 'దేవత' సీరియల్ 8.79 రేటింగ్‌ తో ఐదో స్థానంలో నిలిచింది.

డాక్ట‌ర్ బాబు, దీప క‌లుసుకోబోతున్నార‌ని ప్రేక్ష‌కులు సంతోష ప‌డుతున్నంత‌లో మోనిత ప్రెగ్నెంట్ కావ‌డం, దానికి కార‌ణం డాక్ట‌ర్ బాబేన‌ని ఆమె చెప్ప‌డంతో మొద‌ట ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ రేకెత్తింది. కానీ క్ర‌మంగా సీరియ‌ల్‌ను సాగ‌దీయ‌డంలో భాగంగానే ఇలా చేస్తున్నార‌నే అభిప్రాయం వీక్ష‌కుల‌కు క‌లుగుతోంది. దాంతో ఈ సీరియ‌ల్‌ను రెగ్యుల‌ర్‌గా చూసే ప‌లువురు ప్రేక్ష‌కులు కూడా ఆ సీరియ‌ల్‌పై విముఖ‌త వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం దీప పాత్ర చిత్ర‌ణ కూడా ఆక‌ట్టుకొనే రీతిలో ఉండ‌టం లేద‌ని వారంటున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.