Read more!

English | Telugu

న‌న్ను హేట్ చేసేవాళ్లకు ఐ లవ్ యు చెప్తా!

జబర్దస్త్ నుంచి ఎంతో మంది స్టార్ కమెడియన్స్ గా ఎదిగారు. అలాంటి వాళ్ళల్లో చలాకి చంటి ఒకరు. చంటి ఎన్నో మూవీస్ లో నటిస్తూ జబర్దస్త్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఐతే ఈ ఫీల్డ్ లో ఎన్నో ప్లస్ లు, మైనస్ లు ఉంటాయి. అందరికి అందరూ నచ్చరు. మరి ఇలాంటి టైంలో 'మీ హేటర్స్ కి అంటే మిమ్మల్ని ఇష్టపడని వాళ్లకు మీరేం సమాధానం చెప్తారు.. వాళ్ళ అయిష్టతను మీరెలా రిసీవ్ చేసుకుంటారు?' అనే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు చంటి. 'న‌న్ను ఇష్టపడని వాళ్ళకు, హేట్ చేసేవాళ్లకు ఐ లవ్ యు చెప్తా. వాళ్ళు హేట్ చేస్తేనే కదా నేను ఇంకా ముందుకు పరిగెత్తాలని తెలిసేది. ప్రేమగా ఉంటూ గోతులు తియ్యడం వేరు, ద్వేషిస్తూ మనల్ని ఇంకా పైకి వెళ్లేలా చేయడం వేరు కదా' అని చెప్పాడు చంటి. 

'జబర్దస్త్ కమెడియన్స్ కి సినిమా అవకాశాలు రావు అనే టాక్ నిజమేనా?' అన్న ప్రశ్నకు 'అలాంటిది ఏమీ లేదు. కానీ ఏదైనా మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు ఇటు జబర్దస్త్ కూడా అదే టైంకి చేయాల్సి వచ్చినప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేసుకునే వీలు ఉండదు.. కాబట్టి చాలామంది మూవీ ఆఫర్స్ ని వదిలేసుకుంటూ ఉంటారు' అని చెప్పుకొచ్చాడు చంటి.

'జబర్దస్త్ షో గురించి చాలా మంది వచ్చి చాలా రకాలుగా చెప్పి వెళ్లారు.. కొందరు పాజిటివ్‌గా, కొందరు నెగటివ్ గా చెప్పారు? మరి మీరేం అనుకుంటున్నారు?' అనే ప్రశ్నకు 'ఎవరి ఉద్దేశాలు వాళ్ళు చెప్పారు. చిన్నవాళ్ళనైనా, పెద్దవాళ్ళనైనా విమర్శించేంత స్థాయి, అర్హత నాకు లేదు. అంతకంటే ముందు నాకు ఎవరి గురించి చెప్పేంత టైం కూడా లేదు' అని తేల్చి చెప్పేసాడు చలాకి చంటి. 'చంటి బుర్ర బాగా వాడతారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇలానే  బుర్ర బాగా వాడండి' అని యాంకర్ చెప్పేసరికి చంటి నవ్వేస్తాడు.