English | Telugu

తల్లి కాబోతున్న బుల్లితెర పాపుల‌ర్ నటి!

బుల్లితెర నటి చైత్ర రాయ్ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పలు సీరియల్స్‌లో హీరోయిన్ గా నటించి తెలుగువారికి దగ్గరైంది చైత్ర. 'అష్టా చమ్మా' సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీలో సైతం ఆఫర్లు దక్కించుకుంది. అయితే సడెన్‌గా ఆమె తెలుగు సీరియల్స్‌లో నటించడం మానేసి, ఇండ‌స్ట్రీలోని అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఒకప్పుడు 'ఒకరికి ఒకరు', 'మనసున మనసై', 'దటీజ్ మహాలక్ష్మీ' ఇలా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండేది చైత్ర.

'అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు' సీరియల్‌లో నటిస్తోన్న సమయంలో ఆమె వ్యక్తిగత కారణాల వలన బయటకి వచ్చేసింది. కొంత గ్యాప్ తీసుకుంటున్నానని ప్రకటించింది. అలా చాలా కాలంగా సీరియళ్ల‌కు దూరంగా ఉంటోన్న చైత్ర ఇప్పుడొక గుడ్ న్యూస్ చెప్పింది. తన జీవితంలో కొత్త దశ ప్రారంభం కానుందని చెబుతూ ఎమోషనల్ అయింది.

తాను తల్లి కాబోతున్న విషయాన్ని చెబుతూ.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ''త్వరలోనే బేబీ చైత్ర ప్రసన్న రాబోతుంది.. నా భర్త ప్రసన్నతో కలిసి ఈ విషయాన్ని షేర్ చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.. మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి. మా జీవితాల్లో కొత్త చాప్ట‌ర్‌కు ప్రిపేర్ అవుతున్నాం. నా లైఫ్‌లో అత్యంత అంద‌మైన ద‌శ‌ను అనుభ‌విస్తున్నా'' అంటూ రాసుకొచ్చింది. చైత్ర రాయ్ షేర్ చేసిన బేబీ బంప్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.