శ్రీను వైట్లకు హీరో దొరికేశాడు.. ఈసారి కామెడీ మామూలుగా ఉండదు!
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో శ్రీను వైట్ల ఒకరు. వెంకీ, ఢీ, రెడీ, దూకుడు వంటి ఎన్నో హిట్ సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. అయితే శ్రీను వైట్ల, 2013లో వచ్చిన బాద్షా తర్వాత హిట్ చూడలేదు. వరుసగా ఐదు సినిమాలు నిరాశపరిచాయి. గత చిత్రం 'విశ్వం'తో కమ్ బ్యాక్ ఇస్తారు అనుకుంటే.. అదీ పరాజయంపాలైంది. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు శ్రీను వైట్ల.