Read more!

English | Telugu

బోయపాటి ఫిలింలో పాట పాడే ఛాన్స్ అందుకున్న అయ్యన్ ప్రణతి

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 సెమీఫైనల్స్ సక్సెఫుల్ గా పూర్తి చేసుకుని ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫినాలేకి సౌజన్య, జయరాం, లాస్యప్రియ, నండూరి శృతి, కార్తికేయ సెలెక్ట్ అయ్యారు. ఇందులో అయ్యన్ ప్రణతి ఎలిమినేట్ అయ్యింది. జడ్జెస్ మొత్తం ఈ స్టేజి మీదకు వచ్చి విన్నర్స్ నేమ్స్ అనౌన్స్ చేశారు. ఐతే థమన్ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్న అయ్యన్ ప్రణతిని దగ్గరకు తీసుకుని "తను చాలా అండర్స్టాండింగ్..ఎంతో మందిని ఫేస్ చేసింది. ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంది. ఇంత చిన్న వయసులో ఇంత అర్ధం చేసుకునే గుణం ఉండడం గ్రేట్.

ఈ సందర్భంగా నేను  ఇంకో విషయం చెప్పాలి... ప్రణతి నా నెక్స్ట్ మూవీలో ఒక సాంగ్ పాడుతుంది... త్వరలో ఈ సాంగ్ రికార్డింగ్ చేయబోతున్నాం..బోయపాటి గారి డైరెక్షన్ లో నటిస్తున్న రామ్ ఫిలింకి పాడించబోతున్నాను. వన్ ఇయర్ గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతున్న నా ఫస్ట్ మూవీ అది ...అందులో అయ్యన్ ప్రణతి శ్రీలీలకు ఒక పాట పాడుతోంది. ఈ విషయాన్నీ ఆల్రెడీ మా డైరెక్టర్ కి, హీరోకి కూడా ఇంఫార్మ్ చేసాను" అని గుడ్ న్యూస్ చెప్పడంతో ప్రణతి కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యింది. ఈ షోలో కార్తికేయ సాంగ్స్ కి ఫిదా ఐపోయిన దేవిశ్రీ ప్రసాద్ ఆ కుర్రాడికి ఒక జాకెట్ కూడా ప్రెజంట్ చేశారు. "గీత సుబ్రహ్మణ్యం" సిరీస్ నుంచి హీరోహీరోయిన్స్ అభిజ్ఞ, సుప్రజ ఇద్దరూ వచ్చి తమ వెబ్ సిరీస్ గురించి చెప్పి సక్సెస్ చేయమని కోరారు. ఇలా ఈ వారం సెమీఫైనల్స్ ఎండ్ అయ్యింది.