Home

»

Latest News

అగ్ర హీరో సిద్దార్ధ్ మల్హోత్రా తండ్రి మృతి.. లేట్ గా తెలియడానికి గల కారణం ఏంటి!

Feb 18, 2026

 

-నిద్రలోనే తుదిశ్వాస విడిచిన విడిచిన సునీల్ మల్హోత్రా 
-సోషల్ మీడియాలో పోస్ట్ తో విషయం బయటకి 
-పోస్ట్ లో ఏముంది


సిద్దార్ధ్ మల్హోత్రా(Sidharth Malhotra).. సుదీర్ఘ కాలం నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో రాణిస్తూ తన కంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు. గత ఏడాది ఆగస్టు లో 'పెద్ది' భామ జాన్వీ కపూర్ తో కలిసి 'పరమ్ సుందరి' అంటూ పలకరించాడు. ముఖ్యంగా మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన 'ఏక్ విలన్' లో సీరియల్ హంతకునిగా చెయ్యడం సిద్దార్ధ్  కెరీర్ కి అతిపెద్ద మలుపుతో పాటు మంచి బూస్టప్ ని ఇచ్చింది. ప్రస్తుతం సిద్దార్ధ్ మల్హోత్రా ఫాదర్ చనిపోయిన న్యూస్ బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది. ఆ వివరాలేంటో చూద్దాం.

సిద్దార్ధ్ మల్హోత్రా తండ్రి పేరు సునీల్ మల్హోత్రా(Sunil Malhotra).. ఈ నెల 14 న ఆయన మరణించాడు. కానీ ఈ విషయం ఎవరకి తెలియదు. రీసెంట్ గా సిద్దార్ధ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసాడు. సదరు పోస్ట్ లో 'మా నాన్నగారు నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. కాలం ఆయనకి ఎన్నో పరీక్షలకి గురి చేసినా వాటన్నింటిని  తట్టుకొని నిలబడ్డారు. ఈ క్రమంలోనే హార్ట్ స్ట్రోక్ వీల్ చైర్ కి పరిమితం చేసినా భయపడలేదు.నేను ఈ రోజు నటుడిగా ఉన్నానంటే అందుకు కారణం నా తండ్రి.  నిజాయితీ, విలువలతో నన్ను పెంచారని సదరు పోస్ట్ లో పేర్కొన్నాడు. దీంతో ఆయన మరణ వార్త బయట ప్రపంచానికి తెలిసినట్లయింది.

 

also read:  డీసెంట్ కలెక్షన్స్ తో సైలెంట్ హిట్ గా నిలిచిన 'నిలవే' మూవీ 

 

సునీల్  మల్హోత్రా నేవీ లో కెప్టెన్ గా  పని చేయగా సిద్దార్హ్ మల్హోత్రా తన పంతొమ్మిదివ ఏటా నే మోడల్ గా కెరీర్ ప్రారంభించి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో హీరోగా మారాడు. ప్రస్తుతం కూడా పలు యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ సినిమాల్లోను తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో 'వ్యాన్..ఫోర్స్ ది ఫారెస్ట్', రేస్ పార్ట్ 4 వంటి చిత్రాలు ఉన్నాయి. లెజండ్రీ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి తో ఒక మూవీ ఉన్నట్టుగా బాలీవుడ్ టాక్.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com