English | Telugu
సుడిగాలి సుధీర్ పెళ్లిపై పొలిటీషియన్స్ షాకింగ్ కామెంట్స్..స్టేజ్ పై రచ్చరచ్చ
Updated : Nov 19, 2024
'జబర్దస్త్' అనే కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు పొందిన నటుడు సుడిగాలి సుధీర్(sudigali sudheer)ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించడంతో పాటుగా హీరోగా కూడా చేస్తు తన సత్తా చాటుతున్నాడు. సుధీర్ లేటెస్ట్ గా ప్రముఖ నటుడు రాకింగ్ రాకేష్ హీరోగా తెరకెక్కుతున్న కేసిఆర్(kcr)అలియాస్ కేశవ చంద్ర రమావత్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవ్వడం జరిగింది.
అందులో రాకింగ్ రాకేష్ సతీమణి ప్రముఖ యాంకర్ జోర్దార్ సుజాత మాట్లాడుతూ సుధీర్ పెళ్లి చెయ్యాలా వద్దా అని అక్కడకి విచ్చేసిన అతిధులని అడిగింది.దీంతో ప్రముఖ సినీ,ప్రజా గాయకుడూ,మాజీ ఏంఎల్ ఏ రసమయి బాలకిషన్(rasamayi balakishan)మాట్లాడుతూ ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కూడా సుధీర్ పెళ్లి చేసుకోకపోవడం వల్లే జరుగుతుంది.పెళ్లి అయితే తన గిరాకీ తగ్గిపోతుందనే కారణంతో కూడా సుధీర్ పెళ్లి చేసుకోవడం లేదని చెప్పాడు.
మరో సినీ, ప్రజా పాటల రచయిత, సింగర్ గోరటి వెంకన్న(gorati venkanna)కూడా మాట్లాడుతూ పెళ్లి చేసుకొని ఎవడు సుఖంగా ఉన్నాడు .పెళ్లి అంత అవసరం కూడా కాదు.చేసుకునే పక్షులు లాగా కలిసి ఉండాలని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారడమే కాకుండా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.