English | Telugu
బుచ్చి బాబుతో చిట్టిబాబు కలిసేది అప్పుడే!
Updated : Feb 17, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15 మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో దీల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు.ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి ప్రతి నాయకుడిగా విజయ్ సేతుపతిని రంగంలోకి దించడానికి బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో తీయపోయే ఈ మూవీ షూటింగ్ను ఈ ఏడాది ఆఖరిలో మొదలు పెట్టడానికి రాంచరణ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శంకర్ సినిమా మూవీ ప్రస్తుతం టాకీపార్ట్ పూర్తి కావస్తోంది. ఆ తర్వాత భారీ ఎత్తున పాటలను చిత్రీకరించడానికి సిద్దమవుతున్నారు. శంకర్ సినిమాలలో పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసింది. ఒక్కో పాట కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూ బాగా సమయం తీసుకుని విజువల్ ఫీస్ట్‌గా చిత్రీకరించనున్నారు. సాంగ్స్ చిత్రీకరణ కోసం చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ రిలీజ్ కూడా చూసుకొని నవంబర్‌లో బుచ్చిబాబు సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి రామ్ చరణ్ ప్లాన్ చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
శంకర్ సినిమాతో సోలోగా ఆయన తన మార్కెట్ ఎంత అనేది రామ్ చరణ్ కి క్లారిటీ వస్తుంది. అప్పుడు బుచ్చిబాబు సినిమాను ఆ తర్వాత ఏ రేంజ్లో ఎంత బడ్జెట్ తో ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయం సినిమాను ఏ రేంజ్ లో తీస్తే వర్క్ అవుట్ అవుతుంది అనే లెక్కలు వేసుకోవడానికి వీలవుతుంది. ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ లకు వెళ్లనున్నారు. ఆలోపు స్క్రిప్ట్ కు సంబంధించిన మార్పులు చేర్పులు చేసే పనిలో బుచ్చిబాబు ఉన్నాడని తెలుస్తోంది. మరోవైపు బుచ్చిబాబు తన మూవీకి కావలసిన క్యాస్టింగ్ కూడా ఫైనల్ చేసుకుంటున్నట్టు సమాచారం.