Home

»

Latest News

రేసుగుర్రం ఆడియో విడుదల తేది ఖరారు

Mar 12, 2014

 

అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేసుగుర్రం" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. కానీ ఆరోజు పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశం ఉన్నందువల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసారు. అయితే ఈ ఆడియో కార్యక్రమాన్ని మార్చి 16న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను మార్చి 28న కాకుండా ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయనున్నారు. ఆడియో కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిధిగా రానున్నారని తెలిసింది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, కె.వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్, సలోని కథానాయికలు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com