English | Telugu

922 కోట్ల క్లబ్ లో పుష్ప 2..ఎనీ డౌట్స్  

డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)వన్ మ్యాన్ షో పుష్ప 2(pushpa 2)ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త హిస్టరీ ని క్రియేట్ చేస్తుంది.రిలీజైన అన్ని లాంగ్వేజెస్ లో కూడా అంతకు ముందు వరకు అక్కడ ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నిటిని క్రాస్ చేస్తు తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుంది.

దీంతో పుష్ప ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల గ్రాస్ ని సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది.కేవలం ఐదు రోజుల్లో అత్యంత ఫాస్టెస్ట్ గా ఆ మేర కలెక్షన్స్ ని సాధించిన సినిమా ఇంతరవరకు లేదనే చెప్పాలి.ఇక చిత్ర యూనిట్ ముందు నుంచి కూడా భావిస్తున్న వెయ్యి కోట్ల మార్క్ ఎంత దూరంలోనే లేదనే చెప్పాలి.

ఇక పుష్ప 2 కి హిందీలో అయితే విశేష ఆదరణ లభిస్తుంది.అక్కడ ఇప్పటి వరకు 291 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టగా ఇప్పుడు అది 750 కోట్ల దాకా సాధించవచ్చని బాలీవుడ్ వర్గాలే వారే చెప్తున్నారు.దీన్ని బట్టి పుష్ప మానియా బాలీవుడ్ ని ఎంత ఊపు ఊపుతుందో చెప్పవచ్చు. రీసెంట్ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్(amitabh bachchan)సోషల్ మీడియా వేదికగా పుష్ప 2 గురించి ప్రస్తావిస్తు 'మీ ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులమయ్యాం అంటూ ట్వీట్ చెయ్యడం కూడా జరిగింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.