English | Telugu

ప‌వ‌న్ పుణ్యానైనా ఆమె కోరిక నెర‌వేరుతుందా?



వింక్ బ్యూటీ కి అదృష్టం తలుపు తట్టింది. ఎంత క్రేజ్ ఉన్నా కొన్నిసార్లు కొంతమందికి కమర్షియల్ గా సక్సెస్ లు రావు. క్రేజీ ఆఫర్లు రావ‌డం జ‌ర‌గ‌దు. అదృష్టం తలుపు తట్టదు. వ‌చ్చిన ఒక‌టి రెండు అవ‌కాశాలు కూడా సక్సెస్ కాక పోవడంతో వారికి క్రేజ్ సొంతం కాకుండా పోతుంది. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళం లో ఓరు ఆధార్ లవ్ మూవీ తో తెరంగేట్రం చేసింది. ఓ సీన్‌లో హీరోకి కన్నుకొడుతూ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో నితిన్ తో చెక్ సినిమా చేసింది. తేజస‌జ్జ‌తో ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ లో నటించింది. అదృష్టం అవకాశాల రూపంలో తలుపు తట్టిన సక్సెస్ మాత్రం ఆమెకి ద‌క్క‌లేదు. ఈ రెండు చిత్రాలు ఆమెకి తీవ్ర నిరాశ‌నే మిగిల్చాయి.

ఈ రెండు చిత్రాలు చేదు అనుభవాన్ని మిగ‌ల్చ‌డంతో హిందీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. హిందీలో త్రీ మంకీస్. యారియా 2, లవ్ హాకర్స్, శ్రీదేవి బంగ్లా వంటి సినిమాల్లో నటిస్తోంది. అయినా ఆమె మైండ్ మొత్తం తెలుగు సినిమాల వైపే తిరుగుతోంది. టాలీవుడ్ లో నటించాలని ఇక్కడే పేరు తెచ్చుకోవాలని బలంగా కోరుకుంటుంది. పవర్ స్టార్ రూపంలో ప్రియ ప్రకాష్ వారియర్ కు బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న వినోదాయ సిత్తం రీమేక్ లో అవకాశం వచ్చిందట. సాయి ధరమ్ తేజ్ కు జోడిగా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో ప్రియా ప్రకాష్ వారియర్ దశతిరిగినట్టే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .