English | Telugu
సంక్రాంతి బరిలో శర్వానంద్.. స్టార్ హీరోలకి షాకిస్తాడా..?
Updated : Dec 9, 2025
2026 సంక్రాంతికి థియేటర్లు కళకళలాడనున్నాయి. ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు సినిమాలు విడుదలవుతున్నాయి. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' సైతం సంక్రాంతి బరిలో దిగుతోంది. (Nari Nari Naduma Murari)
సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' చిత్ర విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. 2026 సంక్రాంతి కానుకగా.. జనవరి 14 సాయంత్రం 5:49 నుంచి థియేటర్లలో ఈ చిత్ర సందడి మొదలు కానుంది.
యంగ్ స్టార్స్ లో సంక్రాంతి హీరోగా శర్వానంద్ కి పేరుంది. 2016 సంక్రాంతికి నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి స్టార్ హీరోల సినిమాతో పోటీపడి.. 'ఎక్స్‌ప్రెస్ రాజా'తో హిట్ కొట్టాడు శర్వా. అలాగే 2017లో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలతో పోటీపడి.. శతమానం భవతితో విజయం సాధించాడు. 2026 సంక్రాంతికి కూడా శర్వానంద్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.