Read more!

English | Telugu

కాస్త ముందుగానే మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' టీజర్!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ టీజర్ కి ముహూర్తం ఖరారైంది.

 

మెగాస్టార్ పుట్టినరోజు(ఆగస్టు 22) కానుకగా ఒక రోజు ముందుగానే 'గాడ్ ఫాదర్' టీజర్ రాబోతోంది. ఆగస్టు 21న టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న చిరు లుక్ ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ గత చిత్రం 'ఆచార్య' నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా ఫస్ట్ లుక్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి త్వరలో విడుదల కానున్న టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేస్తుందేమో చూడాలి. 

 

 

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

 

మెగాస్టార్ పుట్టినరోజుకి 'గాడ్ ఫాదర్' టీజర్ తో పాటు మరికొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. 'వాల్తేరు వీరయ్య'(మెగా 154), 'భోళా శంకర్' సినిమాల అప్డేట్స్ కూడా రానున్నాయని సమాచారం.