Read more!

English | Telugu

'ఘరానా మొగుడు' సందడి మొదలైంది!

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా వేసిన 'పోకిరి' స్పెషల్ షోలకు ఎంతటి ఆదరణ లభించిందో తెలిసిందే. ఇప్పుడు 'ఘరానా మొగుడు' స్పెషల్ షోల సందడి షురూ అయింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించనున్న 'ఘరానా మొగుడు' షోల బుకింగ్ ఓపెన్ అయ్యాయి.

 

చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఘరానా మొగుడు'(1992) ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా రూ.10 కోట్ల షేర్ రాబట్టిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచి, ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా.. చిరంజీవిని ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోని చేసింది. 30 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాకి మెగా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. అందుకునేమో మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ మూవీ స్పెషల్ షోలను ప్లాన్ చేశారు.

 

 

ఆగస్టు 21, 22 తేదీలలో హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో 'ఘరానా మొగుడు' స్పెషల్ షోలు వేయనున్నాను. 21 న రెండు, 22 న ఐదు షోలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడు షోలకు సంబంధించి బుక్ మై షోలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ స్పెషల్ షోల బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 30 శాతం దాకా సీట్లు బుక్ అవ్వడం విశేషం.