Home

»

Latest News

'ఫంకీ' బిజినెస్.. హిట్ కొట్టాలంటే అన్ని కోట్ల షేర్ రావాల్సిందే!

Feb 12, 2026

 

విశ్వక్ సేన్ (Vishwak Sen), కయాదు లోహర్‌(Kayadu Lohar) జంటగా కె.వి. అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఫంకీ'(Funky). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ రేపు(ఫిబ్రవరి 13) ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు అనుదీప్ 'జాతిరత్నాలు' శైలిలో మరోసారి నవ్వించనున్నాడని ప్రచార చిత్రాలతో స్పష్టమైంది. (Anudeep KV)

 

ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'ఫంకీ' సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా థియేట్రికల్ గా బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో రూ.4 కోట్లు, ఆంధ్రాలో రూ.5 కోట్లు, సీడెడ్ లో రూ.1.25 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ.10.25 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఒక రెస్టాఫ్ ఇండియా రూ.75 లక్షలు, ఓవర్సీస్ రూ.2 కోట్లు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.13 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.14 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది.

 

విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్ కావడంతో రూ.14 కోట్ల షేర్ అనేది పెద్ద టార్గెట్ కాదని చెప్పవచ్చు. కామెడీ వర్కౌట్ అయ్యి, పాజిటివ్ టాక్ వస్తే.. ఈజీగానే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అందుకునే ఛాన్స్ ఉంది. చూద్దాం మరి 'ఫంకీ' ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో.

 

Also Read: సితారతో నాని మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com