Home

»

Latest News

మాంత్రికుల వారితో చరణ్, దిల్ రాజు సినిమా..!

Jun 07, 2016

త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఏంటన్న దానిపై గతకొంతకాలంగా ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఎక్కువ శాతం మంది త్రివిక్రమ్ పవన్ తోనే సినిమా తీస్తాడని, కోబలి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని అనుకున్నారు. అయితే ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ, దిల్ రాజు తన కాంబినేషన్లో త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఉంటుందని అనౌన్స్ చేసేశాడు. మరి హీరో ఎవరు అంటే, ఇప్పటి వరకూ త్రివిక్రమ్ తో చేయని స్టార్ హీరో అని సెలవిచ్చారు రాజు గారు. సినీజనాలు మాత్రం ఆ స్టార్ మరెవరో కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అని కన్ఫామ్ చేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయాలని ఉందని చరణ్ కొన్ని సందర్భాల్లో అన్నాడు. దిల్ రాజు నిర్మాణం లో తీసిన చెర్రీ సినిమా ' ఎవడు ' మంచి విజయాన్ని సాధించింది. అందుకే ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ పక్కా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. " త్రివిక్రమ్ తో నువ్వే కావాలి టైం నుంచి మంచి అనుబంధం ఉంది, ఆయనతో సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది. పూర్తి వివరాలు మాత్రం త్వరలో చెబుతాం " అంటూ సస్పెన్స్ లో ముగించారు రాజు గారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com