Read more!

English | Telugu

మేనకోడలు రాకతో హద్దుల్లేని దేవిశ్రీ ఆనందం!

దేవి శ్రీప్రసాద్ సౌత్ సింగర్స్ లో టాప్ సింగర్. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే నేపథ్య గాయకుడు కూడా. టీనేజ్ లోనే 'దేవి' అనే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అద్భుతమైన పాటలు రాసాడు. అవి అప్పట్లో ఎంతో  సంచలనం సృష్టించి ఆ మూవీ మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. అలా ఆయన పేరు ముందు ఆ చిత్రం పేరు చేరి దేవి శ్రీప్రసాద్ అయ్యింది. ఇక వాళ్ళ నాన్న గొర్తి సత్యమూర్తి ఒక‌ప్పుడు పాపుల‌ర్ సినిమా రైట‌ర్‌. అమ్మ  శిరోమణి. వాళ్ళది మంచి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ వున్న ఫ్యామిలీ. ఇక దేవిశ్రీకి తమ్ముడు సాగర్, చెల్లి పద్మిని ఉన్నారు. 

ఇప్పుడు దేవిశ్రీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే పద్మినికి ఇటీవల కూతురు పుట్టింది. ఆ చిన్నారి పేరు తమిరా శ్రీవ్యా. ఈ చిన్నారిని చాలా హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చారు దేవి శ్రీప్రసాద్, వాళ్ళ చెల్లి పద్మిని. కారులో చిన్నారిని తీసుకొచ్చేటప్పుడు బ్యాగ్రౌండ్ వాయిస్ గా మన్మథుడు చిత్రంలో దేవి కంపోజ్ చేసిన "నేను నేనుగా లేనే" అనే సాంగ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది.

దేవి శ్రీప్రసాద్ చెల్లి పద్మిని ఒక ఆర్కిటెక్ట్. ఆమెకు మొదట ఒక అబ్బాయి పుట్టాడు. తన పేరు తనవ్ సత్య. చనిపోయిన వాళ్ళ నాన్నే తిరిగొచ్చినట్లు భావిస్తానని అందుకే మేనల్లుడిని ముద్దుగా "డాడీ బాయ్" అని పిలుస్తాడట దేవి శ్రీప్రసాద్. ఇక ఇప్పుడు తమ ఇంట్లో అడుగు పెట్టిన మేనకోడలిని వాళ్ళ నాన్న చిత్రపటం దగ్గరకు తీసుకెళ్లి తర్వాత దేవుడి చిత్రపటాలకు చూపించి వాళ్ళ ఆశీర్వాదం ఇప్పించారు. ఇక దేవి శ్రీప్రసాద్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఆ చిన్నారిని రెండు చేతుల్లో ఎత్తుకుని ఉయ్యాలలా ఊపుతూ చాలా హ్యాపీగా ఇంట్లో సందడి చేసాడు.