English | Telugu

రాజమండ్రిలో రాజబాబు విగ్రహం

అలనాటి మేటి హాస్యనటుడు, మనసున్న మనిషి రాజబాబు చనిపోయి ఏప్రెల్ 9 వ తేదీకి 75 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాజబాబు జన్మించిన రాజమండ్రి నగరంలో, రాజబాబు విగ్రహాన్ని ప్రతిష్టించాలని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు మురళీ మోహన్ తీర్మానించారు. అందుకు అవసరమైన ధనాన్ని కూడా మురళీ మోహన్ తానే స్వయంగా సమకూరుస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు 75 మంది సినీహాస్య నటీనటులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న రాజబాబు కుమారులు భారతదేశానికి రానున్నారు. రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో రాజబాబు విగ్రహాన్ని ప్రతిష్టించటం చాలా ముదావహమని సినీ పరిశ్రమ "మా" అసోసియేషన్ ని ప్రశంసిస్తోంది.

ఈ కార్యక్రమం జరగటం తమకు చాలా ఆనందంగా ఉందని రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్, బాబి తమ ఆనందాన్ని తెలియజేశారు. ఏప్రెల్ 9 వ తేదీన, ఆలస్యంగానైనా రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో రాజబాబు విగ్రహప్రతిష్ట జరపటం సినీపరిశ్రమ ఆయనకు ఇచ్చే ఘననివాళిగా భావించవచ్చు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.