English | Telugu

ప్రభాస్ కల్కి సినిమానే నెంబర్ వన్.. పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి

2024 సంవత్సరంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చి ప్రేక్షకులకి కనువిందు చెయ్యడమే కాకుండా సరికొత్త కదాంశాలతో మెస్మరైజ్ కూడా చేశాయని చెప్పవచ్చు. మోస్ట్ లీ అన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కడంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులని కూడా సృష్టించాయి.ఇక మరికొన్ని రోజుల్లో 2024 కి సెండ్ ఆఫ్ చెప్తుండటంతో ప్రఖ్యాత ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ imdb 2024 లో మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాని విడుదల చేసింది.
1 .కల్కి 2898 ఏడి
2 .స్త్రీ 2
3 . మహారాజ్
4 .షైతాన్
5 . ఫైటర్
6 .మంజుమ్మేల్ బాయ్స్
7 .భూల్ భూలయ్య 3
8 .కిల్
9 .సింగం అగైన్
10 లాపతా లేడీస్

ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 25 మధ్య రిలీజ్ అయిన చిత్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెండు వందల యాభై మిలియన్స్ కి పైగా సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణాలని పరిగణలోకి తీసుకొని మొదటి పది సినిమాలని ప్రకటించడం జరిగిందని సదరు imdb సంస్థ వెల్లడి చెయ్యడం జరిగింది.ఇక దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది గూగుల్ లో ప్రభాస్(prabhas)నటించిన సలార్, కల్కి 2898 ఏడి గురించి వెతికారని కూడా imdb వెల్లడించింది.


Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...