English | Telugu

నాకు తెలియకుండానే సినిమా ప్లాన్ చేసారు..పూరి జగన్నాధ్  ఏం చెప్తాడో చూడాలి 

అభిమానులు అయితే ఏమి ప్రేక్షకులు అయితే ఏమి సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తుండటం ఆనవాయితీ. కానీ టీజర్ కోసం ఎదురుచూస్తుంటే. ఏంటి టీజర్ కోసం కూడా ఎదురుచూస్తుంటారా అని అనుకోవద్దు. హైదరాబాద్ షాన్ కోసం ఎదురుచూస్తుంటారు. అదేనండీ మన ఇస్మార్ట్ శంకర్ కోసం. వాళ్ళ ఎదురుచూపులు నేడు ఫలించాయి

రామ్ పోతినేని (Ram Pothineni)హీరోగా పూరి జగన్నాధ్(puri jagannadh) దర్శకత్వంలో వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్ (Double ismart)2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్( ismart shankar)కి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ రోజు టీజర్ రిలీజ్ అయ్యింది. ఒక నిమిషం ఇరవై ఆరు సెకన్లు నిడివితో అలా రిలీజ్ అయ్యిందో లేదో సోషల్ మీడియాలో రికార్ట్డ్ వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.నాకు తెలియకుండా సినిమా ప్లాన్ చేస్తే ఎలా అంటూ రామ్ తన స్టైల్ ఆఫ్ మాట తీరుతో చెప్పడం చూస్తుంటే ప్రేక్షకుల్లో మళ్ళీ శంకర్ మానియా ప్రారంభం అయినట్టయ్యింది. నాకు తెలియకుండా సినిమా ప్లాన్ చేస్తే బాగోదు అని చెప్పడం కూడా చాలా బాగుంది .అలాగే రామ్ కి కొంత మంది డాక్టర్స్ ట్రీట్ మెంట్ చేస్తుండటం కథ విషయంలో క్యూరియాసిటీ ని కలిగిస్తుంది.ఒక్కటి మాత్రం నిజం.రామ్ మరోసారి శంకర్ క్యారక్టర్ లో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు .ఇక విలన్ గా సంజయ్ దత్ మెరుపులు కూడా ఉండబోతున్నాయనే విషయం అర్ధమవుతుంది. మణిశర్మ (mani sharma) అందించిన ఆర్ ఆర్ కూడా సూపర్ గా ఉంది. దీంతో అందరు సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు

ఇక పూరి మరోసారి తన సత్తా చాట బోతున్నాడనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. రామ్ సరసన కావ్య థాపర్ చేస్తుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా టీజర్ రిలీజ్ అయ్యింది. దీన్ని బట్టి శంకర్ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.ఇక టీజర్ చూసిన రామ్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. టైటిల్ కి తగ్గట్టే వాళ్ళకి డబుల్ పండుగ తెచ్చింది. ఎందుకంటే ఈ రోజు రామ్ పుట్టిన రోజు. దీంతో సంబరాల్లో మునిగిపోయారు.పూరి జగన్నాధ్, ఛార్మి లు నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో ఉన్న శంకర్ ప్రాబ్లమ్ కి డబుల్ ఇస్మార్ట్ లో సొల్యూషన్ దొరుకుతుందేమో చూడాలి


సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.