
Peddi: రామ్ చరణ్ సాక్షాత్తూ హనుమంతుడిలా కనిపించారు.. ఆ షాట్ చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఒక చిన్న అబ్బాయి రామ్ చరణ్‌కు అదిరిపోయే ఎలివేషన్ ఇస్తూ కనిపించాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు.. సయ్యద్ గఫూర్. ‘తెలుగువన్’(TeluguOne)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గఫూర్ ‘పెద్ది’ మరియు జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ (Dragon) షూటింగ్ విశేషాలను, తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను పంచుకున్నాడు. (Actor Sayed Gafur Interview) సయ్యద్ గఫూర్ చిన్నతనంలోనే (ఐదేళ్ల వయసులో) తల్లిదండ్రులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు. కర్నూలు జిల్లా దొన్నిపాడు గ్రామానికి చెందిన గఫూర్‌ను వాళ్ల అమ్మమ్మ, మామయ్య పెంచారు. నటనపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ వచ్చి, అన్నపూర్ణ స్టూడియోస్ యాక్టింగ్ అకాడమీలో శిక్షణ పొందాడు. గతంలో ‘అఖండ’ సినిమాలో నటించినప్పటికీ కొన్ని ముఖ్యమైన సీన్స్ ఎడిటింగ్‌లో పోవడంతో నిరాశ చెందాడు. కానీ ఇప్పుడు ‘పెద్ది’, ‘డ్రాగన్’ వంటి క్రేజీ ప్రాజెక్టులలో కీలక పాత్రలు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘పెద్ది’ ఆడిషన్స్ అనుభవాన్ని చెప్తూ.. దాదాపు 300 మందిలో బుచ్చిబాబు గారు తనను సెలెక్ట్ చేశారని గఫూర్ తెలిపాడు. అయితే, వేరే వెబ్ సిరీస్ షూటింగ్ వల్ల తను తెల్లగా మారిపోవడంతో, ‘పెద్ది’ షూటింగ్ సెట్లో బుచ్చిబాబు గారు గుర్తుపట్టలేదని అన్నాడు. విలేజ్ బాయ్ లుక్ కోసం వెంటనే టాన్ కావలసి రావడంతో.. సమయం లేక బాత్రూం పక్కన ఉన్న మట్టిని ఒంటికి, మొహానికి రాసుకుని అండర్‌వేర్‌తోనే మానిటర్ ముందుకు వెళ్లానని ఆనాటి కష్టాన్ని గుర్తుచేసుకున్నాడు. రామ్ చరణ్ సార్ షాట్ కోసం ఎదురుచూస్తున్న ఆ సమయంలో, తను సింగిల్ టేక్‌లోనే ఆ ఎలివేషన్ డైలాగ్ చెప్పి బుచ్చిబాబు గారిని మెప్పించానని సంతోషంగా చెప్పాడు. సెట్లో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ గురించి గఫూర్ అద్భుతంగా వివరించాడు. చరణ్ సార్ పూర్తిగా వెజిటేరియన్ బాడీని మెయింటైన్ చేస్తున్నారని, ఆయన మజిల్స్ చూస్తే సాక్షాత్తూ హనుమంతుడిని చూసినట్లు అనిపించిందని అన్నాడు. చేతికి గాయమైనా లెక్కచేయకుండా ప్రతి షాట్‌కు ముందు డిప్స్ కొడుతూ ఎంతో కష్టపడ్డారని శ్లాఘించాడు. ‘రంగస్థలం’ కంటే ముందు వచ్చిన రామ్ చరణ్ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ ‘పెద్ది’ సినిమా ఒక్కటి ఒక ఎత్తు అని.. బుచ్చిబాబు గారు చరణ్ సార్‌ను నటనలో పిండేశారని గఫూర్ అన్నాడు. ఇక ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ ల ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ అనుభవాలను కూడా గఫూర్ పంచుకున్నాడు. ఒక సీన్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ గారు స్వయంగా తన వైట్ ట్రాక్ ప్యాంటును కూడా లెక్కచేయకుండా బొగ్గుల మట్టిలో మోకాళ్లపై కూర్చుని తనకు నటన నేర్పించారని చెప్పాడు. ఆ తర్వాత తన షాట్ చూసి క్యారవాన్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సార్ ఎంతో అప్రిషియేట్ చేశారని ఆనందం వ్యక్తం చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గఫూర్ పూర్తి ఇంటర్వ్యూతో పాటు మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Jun 1, 2026 12:09PM
పాన్ ఇండియా మోజులో టాలీవుడ్ స్టార్ హీరోలు.. బివిఎస్ రవి సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ స్థాయి ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ భాషా చిత్రాలకే పరిమితమైన తెలుగు సినిమా, నేడు పాన్ ఇండియా మార్కెట్‌ను దాటి గ్లోబల్ వైడ్‌గా తన సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు బివిఎస్ రవి (BVS Ravi) తాజాగా టాలీవుడ్ అగ్ర హీరోల స్టామినా మరియు పాన్ ఇండియా సినిమాల మేకింగ్ విధానంపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తెలుగువన్ (TeluguOne) ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సినిమా ఇండస్ట్రీలోని ప్రస్తుత ట్రెండ్‌తో పాటు స్టార్ హీరోల డెడికేషన్ గురించి పలు సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మోజులో పడ్డారని బివిఎస్ రవి వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మకమైన సినిమాల కోసం వారు చూపిస్తున్న నిబద్ధత నిజంగా అభినందనీయమన్నారు. ఒక సినిమా కోసం హీరోలు ఏకంగా రెండు సంవత్సరాల పాటు సమయాన్ని కేటాయిస్తున్నారని, పాత్రలకు తగ్గట్టుగా జుట్టు పెంచుకొని, గడ్డాలు పెంచుకుంటూ, మొహానికి బూడిద రాసుకునేందుకు సైతం వెనుకాడటం లేదని ఆయన పేర్కొన్నారు. పాన్ ఇండియా సినిమా అంటే కేవలం భారీ టైటిల్స్ వేయడం మాత్రమే కాదని, వెండితెరపై నటీనటుల ఒళ్లు హూనమైపోయేలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పారు. యాక్షన్ సీన్స్ లో పిల్లిమొగ్గలు వేయిస్తూ, గాలిలో కాసేపు వైర్లతో కట్టేసి ఉంచినా సరే, హీరోలు ఎంతో ఓపికగా కష్టపడుతున్నారని, వారు భోజనానికి వెళ్లే సమయాన్ని కూడా లెక్కచేయకుండా సీన్ పర్ఫెక్ట్గా వచ్చే వరకు శ్రమిస్తున్నారని వెల్లడించారు. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలతో తనకున్న అనుభవాలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను ఇద్దరు అగ్ర హీరోల కాంబినేషన్ లోనూ యాక్టింగ్ చేశానని చెప్పారు. ఒక సినిమాలో బాలకృష్ణ గారు తనను కొట్టే సీన్ ఉందని, ఆ రోజు పొద్దునంతా తనది 'నోటిదూల క్యారెక్టర్' కావడంతో ఆయనను గెలకాల్సి వచ్చిందని, దీంతో తన గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని నవ్వుతూ పంచుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో నటించేటప్పుడు ఆయన డైలాగ్ చెబితే తాను కౌంటర్ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందని, ఆ సమయంలో కూడా కొంచెం భయపడ్డానని అన్నారు. టాలీవుడ్ లో మోహన్ బాబు కాంపౌండ్, చిరంజీవి కాంపౌండ్, బాలకృష్ణ కాంపౌండ్, అల్లు అర్జున్ కాంపౌండ్ ఇలా అన్ని కాంపౌండ్స్ తోనూ తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, ఎవరి దగ్గరకు వెళ్లినా వారి ప్రైవసీకి గౌరవం ఇవ్వడం వల్లే తనకు ఈ క్రేజ్ దక్కిందని బివిఎస్ రవి స్పష్టం చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'డ్రాగన్' (Dragon) గ్లింప్స్ చూసిన తర్వాత టాలీవుడ్ హీరోల పవర్ ఏంటో అందరికీ అర్థమైందని బివిఎస్ రవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తున్నప్పటికీ థియేటర్లలో సరైన సినిమాలు లేక మల్టీప్లెక్స్‌లలో చాలా షోలు క్యాన్సిల్ అవుతున్నాయని, సింగిల్ స్క్రీన్స్ తాళాలు వేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, త్వరలోనే రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఊపు తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
May 30, 2026 4:35PM
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్..
1. 'పెద్ది' మూవీ దుబాయ్ సెన్సార్ టాక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాల నుంచి బ్లాక్‌బస్టర్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఫస్టాఫ్‌లో రామ్ చరణ్ - జగపతిబాబుల మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా ఉండటంతో పాటు.. సెకండాఫ్‌లోని చివరి 45 నిమిషాలు, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. 2. నార్త్ లో ఎన్టీఆర్ 'డ్రాగన్' క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ 'డ్రాగన్'. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్.. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ గ్లింప్స్ ఒక్క హిందీ వెర్షన్ లోనే ఏకంగా 40 మిలియన్ వ్యూస్ మైలురాయిని దాటి యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. హిందీలో ఈ గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. నార్త్ ఇండియా బాక్సాఫీస్ ను డ్రాగన్ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 3. 'విశ్వనాథ్ అండ్ సన్స్' రిలీజ్ డేట్ ఫిక్స్ కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'లక్కీ భాస్కర్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పాటు, ఇటీవల 'కరుప్పు'తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూర్య నెక్స్ట్ మూవీ కావడంతో.. దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 4. ముంబైలో బాలయ్య విధ్వంసం! నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రానున్న 'NBK 111' మూవీ, ముంబై నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం బాలకృష్ణ ఈ వారంలోనే ముంబై వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే లాంగ్ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, భారీ యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్‌గా సందడి చేయనున్నట్లు సమాచారం. 5. 'పెద్ది' సినిమాకి హైకోర్టు యాంటీ పైరసీ ఉత్తర్వులు 'పెద్ది' సినిమా ఇంటర్నెట్లో అనధికారికంగా అప్లోడ్ కాకుండా మరియు పైరసీకి గురికాకుండా అడ్డుకోవడానికి మద్రాస్ హైకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్ర నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. యాంటీ-పైరసీ ఆదేశాలను ఇచ్చింది. దీని ద్వారా సినిమాను చట్టవిరుద్ధంగా కాపీ చేయడం, పైరసీ వెబ్సైట్లలో ప్రసారం చేయడం వంటి చర్యలపై కోర్టు నిషేధం విధించింది. 6. 'ఎల్లమ్మ'గా యంగ్ బ్యూటీ 'బలగం' ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న 'ఎల్లమ్మ' సినిమాలో హీరోయిన్గా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు నటించనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాలో హీరోయిన్ పాత్ర కోసం ప్రస్తుతం చిత్ర బృందం మమితతో సంప్రదింపులు జరుపుతోంది. గతంలో ఈ క్యారెక్టర్ కోసం సాయిపల్లవి, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించగా.. ఫైనల్‌గా ఈ కేరళ కుట్టికి ఛాన్స్ దక్కినట్లు ఫిలిం నగర్ టాక్. 7. 'బ్లాస్ట్ జోన్' మూవీ రివ్యూ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించిన 'బ్లాస్ట్ జోన్' మూవీ నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా సింపుల్ స్టోరీతో సాగినప్పటికీ.. యాక్షన్ ప్రియులను అలరించేలా చక్కటి వినోదభరితమైన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచింది. నటీనటుల పర్ఫార్మెన్స్, సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్, రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫస్టాఫ్ కథనం కాస్త నెమ్మదిగా సాగడం, సినిమాలోని చాలా సన్నివేశాలు ఊహకందేలా ఉండటం మైనస్ అయింది. 8. 'జైలర్ 2' సినిమాలో హృతిక్ రోషన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2'లో ఒక పవర్ఫుల్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యామియో పాత్ర కోసం మొదట షారుఖ్ ఖాన్ అనుకున్నప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సంప్రదించగా, ఆయన రాజకీయ కారణాల వల్ల నో చెప్పారు. కథను మలుపు తిప్పే ఈ కీలక పాత్ర కోసం ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో చర్చలు జరుపుతున్నారు. 9. డివైడ్ టాక్ తో 200 కోట్లు... మలయాళ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ, కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటేసి సంచలనం సృష్టించింది. 'దృశ్యం' ఫ్రాంచైజీలోనే అత్యంత వేగంగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా నిలవడమే కాకుండా, మాలీవుడ్‌లో ఈ ఏడాది అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. 10. ఆరు కోట్లు పెడితే.. 800 కోట్లు వచ్చాయి హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అబ్సెషన్' (Obsession). కేవలం రూ.6.25 కోట్ల బడ్జెట్‌తో, 20 రోజుల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 830 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 2026లోనే అత్యంత భారీ ప్రాఫిట్స్ అందుకున్న హాలీవుడ్ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది.
May 28, 2026 3:21PM
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్
1. ఎట్టకేలకు బుల్లితెరపైకి దేవర జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'దేవర' శాటిలైట్ హక్కులకు సంబంధించిన డీల్ ఎట్టకేలకు క్లోజ్ అయింది. థియేటర్లలో విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఇంతవరకు ఈ సినిమా టీవీలో ప్రసారం కాకపోవడం విశేషం. ఈ సినిమాను బుల్లితెరపై చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రముఖ టీవీ నెట్వర్క్ 'ఈటీవీ', ఈ సినిమా శాటిలైట్ హక్కులకు సొంతం చేసుకుంది. భారీ ధరకే ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ కాంబోకు సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే ప్రారంభమైనట్లు న్యూస్ వినిపిస్తోంది. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' సినిమా చేస్తుండగా.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 3. 'పెద్ది' సినిమాకు రూట్ క్లియర్ మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ మూవీ 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది. థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ సిస్టమ్‌పై చర్చలు జరుగుతున్నా.. తెలంగాణలో ఈ సినిమా పాత రెంటల్ విధానంలోనే రిలీజ్ కాబోతోంది. ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో పర్సంటేజ్ సిస్టమ్ అమలుకు సంబంధించిన నిబంధనలపై చర్చలు సాగుతున్నాయి. అన్ని విషయాలను క్షుణ్ణంగా సమీక్షించి రాబోయే జులై నెల నుండి కొత్త పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. 4. మంచు మనోజ్ కాదు.. మంచి మనోజ్ మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ లోని 'మాతృదేవోభవ' అనాథాశ్రమాన్ని సందర్శించారు. సోషల్ మీడియాలో ఆశ్రమ నిర్వాహకులు పెట్టిన వీడియో చూసి చలించిన ఆయన, అక్కడ మతిస్థిమితం లేని ఒక వ్యక్తికి స్వయంగా కటింగ్ చేసి, కొత్త బట్టలు అందించారు. ఆశ్రమానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలను విరాళంగా ఇవ్వడంతో పాటు భవిష్యత్తులోనూ తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. 5. పెద్దికి అంకితమైపోయిన అప్పలసూరి 'పెద్ది' సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు 'అప్పలసూరి' అనే పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తన డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నట్లు జగపతి బాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. డబ్బింగ్ స్టూడియోలో దర్శకుడు బుచ్చిబాబు పర్యవేక్షణలో సాగుతున్న ఈ డబ్బింగ్ వీడియోను షేర్ చేస్తూ.. "పెద్దికి అంకితమైపోయిన అప్పలసూరి" అని ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. 6. 'ది డర్టీ పిక్చర్'లో చూపించింది అబద్ధం నాటి గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత తనను కొట్టిందంటూ చాలాకాలంగా ప్రచారంలో ఉన్న వివాదంపై నటి షకీలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. 'ది డర్టీ పిక్చర్' సినిమాలో చూపించినట్లుగా తామిద్దరం ఎప్పుడూ ప్రత్యర్థులం కాదని, సిల్క్ స్మిత తనకు ఎంతో ఆత్మీయురాలని షకీలా స్పష్టం చేశారు. ఒక సినిమా షూటింగ్ సీన్లో భాగంగా సిల్క్ స్మిత తనను నిజంగానే గట్టిగా తన్నాల్సి వచ్చిందని, అయితే షాట్ పూర్తయిన వెంటనే ఆమె తనను కౌగిలించుకుని ఓదార్చిందని షకీలా చెప్పారు. 7. చేతులు కలిపిన థమన్, అనిరుధ్ ఎస్.ఎస్. థమన్, అనిరుధ్ రవిచందర్ కలయికపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'మిత్రమా ఇక మొదలెడదామా' అంటూ అనిరుధ్‌ను ట్యాగ్ చేస్తూ.. థమన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఇద్దరి కాంబోలో ఏదో పెద్ద ప్రాజెక్ట్ రాబోతోందని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని, థమన్ సంగీతం అందిస్తున్న ఒక సినిమాలో అనిరుధ్ కేవలం ఓ పాట పాడుతున్నట్లు సమాచారం. 8. త్వరలోనే 'కరుప్పు' సీక్వెల్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'కరుప్పు' ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్లో పాల్గొన్న సూర్య.. ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. 'కరుప్పు 2' ప్రాజెక్ట్ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, దీనికి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే వెల్లడవుతాయని సూర్య పేర్కొన్నారు. 9. సీఎం విజయ్ సంచలన నిర్ణయం తమిళ సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి విజయ్ గుడ్ న్యూస్ చెప్పారు. తమిళనాడులో రోజుకు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చారు. జూన్ ఫస్ట్ నుండి ఇది అమలులోకి రానుంది. ఈ నిర్ణయం పట్ల కోలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య ప్రేక్షకుడిపై అదనపు టికెట్ రేట్ల భారం పడకుండా, కలెక్షన్లు పెంచుకునేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 10. ధురంధర్ హీరోపై బాలీవుడ్ బ్యాన్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ తలపెట్టిన 'డాన్ 3' ప్రాజెక్ట్ నుండి బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభానికి ముందు ఆయన తప్పుకోవడంతో.. ప్రీ-ప్రొడక్షన్ దశలో నిర్మాతలకు దాదాపు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నేపథ్యంలో 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్' రణ్‌వీర్‌పై నాన్-కోఆపరేషన్ ఆదేశాలు జారీ చేస్తూ బ్యాన్ విధించింది. ఇరువర్గాలు త్వరలోనే చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
May 26, 2026 3:49PM
Mahesh Babu: మహేశ్, ప్రశాంత్ నీల్ ఊహించని కాంబో.. క్రేజీ అప్డేట్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu),ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని, ఇండస్ట్రీ వర్గాలని ఊపేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రాథమిక చర్చలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ కాంబో గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సినీ ప్రియులు, అభిమానులు మాత్రం ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ పవర్ఫుల్ ఎలివేషన్స్, అద్భుతమైన స్టోరీ నరేషన్, మహేశ్ వన్ మ్యాన్ షో స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)తో చేస్తున్న 'డ్రాగన్'(Dragon)తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధించి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో 'సలార్ 2' సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తన మార్క్ డార్క్ టోన్, నియో నాయర్ యాక్షన్ సినిమాలకి కొంత విరామం ఇచ్చి, మైథాలజికల్ లేదా డిఫరెంట్ జానర్ వైపు అడుగులు వేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ సరికొత్త ప్రయోగంలో భాగంగానే మహేశ్ బాబు కోసం ఒక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మహేశ్ ప్రస్తుతం గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్వ రల్డ్ మూవీ 'వారణాసి'(Varanasi)షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 'వారణాసి' తర్వాత మహేశ్ బాబు, సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ నుంచి వచ్చిన సరికొత్త ప్రపోజల్ మహేశ్ బాబుని ఆలోచనలో పడేసిందని, మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. Also read: VIJay: సీఎం విజయ్‌పై సముద్రఖని సంచలన వ్యాఖ్యలు..ఏం అర్హత ఉందో ఇప్పుడు అర్థమైందా! అయితే ఈ ఊహించని కాంబో పట్టాలెక్కడానికి కనీసం మూడేళ్ళ సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే మహేశ్ బాబు 'వారణాసి' ప్రాజెక్ట్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ కూడా 'డ్రాగన్', 'సలార్ 2', మరియు హోంబాలే ఫిలిమ్స్‌తో ఉన్న ఒప్పందాల ప్రకారం 'కేజీఎఫ్ 3' లాంటి భారీ కట్టుబాట్లని పూర్తి చేయాలి. ఒకవేళ వీరద్దరి షెడ్యూల్స్ అన్నీ అనుకూలించి, కథ లాక్ అయితే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కావడం ఖాయం.
May 26, 2026 3:30PM
Rukmini vasanth: రుక్మిణి వసంత్ పిక్స్ మళ్ళీ వైరల్.. ఇంత అందంగా ఉందేంటి
రెండు రోజుల క్రితం రుక్మిణి వసంత్(Rukmini vasanth)బికినీ ధరించిన పిక్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో సదరు పిక్స్ నావి కాదని ఏఐ తో మార్ఫింగ్ చెసినవాని ఇక ముందు ఆ విధంగా ఎవరైనా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటానని రుక్మిణి వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంఘటన జరిగిన తర్వాత నిజమైన అందంతో కూడిన రుక్మిణి క్యూట్ పిక్స్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లైట్ సిల్వర్ కలర్ శారీ ధరించిన రుక్మిణి తన అందంతో అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రుక్మిణి ప్రశుతం ఒక ఫంక్షన్ కి హాజరైన రుక్మిణి ప్రస్తుతం మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ లో ఒక పవర్ ఫుల్ రోల్ లో చేస్తుంది. యష్ వన్ మాన్ షో టాక్సిక్ లో కూడా కనువిందు చేయనుంది Also read: Peddi: అదిరిపోయే అప్ డేట్ ని మోసుకొచ్చిన పెద్ది.. జోష్ లో ఫ్యాన్స్
May 26, 2026 11:56AM
NTR Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్' సీక్రెట్ లీక్.. అసలు కథ ఇదే!
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు కానుకగా మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'NTRNeel' అధికారిక టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన 'డ్రాగన్' (Dragon) ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్, తారక్‌ను మునుపెన్నడూ చూడని అత్యంత పవర్ఫుల్, డార్కెస్ట్ అవతారంలో ప్రెసెంట్ చేశారు. దాదాపు 4 నిమిషాల పైగా నిడివితో వచ్చిన ఈ గ్లింప్స్ వీడియో కేవలం టీజర్ మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ సృష్టించిన ఒక సరికొత్త రక్తపాత సామ్రాజ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ కథ 1967 నాటి అంతర్జాతీయ ఓపియం (నల్లమందు) వ్యాపారం, స్మగ్లింగ్ నేపథ్యంతో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశ సరిహద్దుల్లో డ్రగ్స్ మాఫియాను శాసించిన అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య జరిగే సుప్రీమసీ వార్‌ను ఈ గ్లింప్స్‌లో అద్భుతంగా చూపించారు. అయితే 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చిన తర్వాత 'Chasing the Dragon' గురించి తెగ చర్చ జరుగుతోంది. 'Chasing the Dragon'... వినడానికి ఏదో హాలీవుడ్ ఫాంటసీ సినిమా పేరులా ఉంది కదూ? కానీ దీని వెనుక ఉన్నది ఒక భయంకరమైన, నెత్తుటి డ్రగ్ హిస్టరీ! ఈ డ్రాగన్ వెనుక ఉన్న అసలు విలన్ 'Opium Poppy' అంటే నల్లమందు గసగసాల మొక్క. దీని కాయల నుండి వచ్చే తెల్లటి జిగురుతోనే అఫిమ్, మార్ఫిన్, చివరకు ప్రపంచాన్ని వణికించే మోస్ట్ డేంజరస్ డ్రగ్ 'హెరాయిన్ (Heroin)' తయారుచేస్తారు. అయితే, ఈ హెరాయిన్ లేదా నల్లమందును కాల్చి, ఆ పొగను పీల్చే ఒక చైనీస్ ట్రెడిషనల్ పద్ధతి ఉంది. అల్యూమినియం ఫాయిల్ మీద ఆ డ్రగ్ పౌడర్ వేసి కింద మంట పెడితే... అది కరిగి ద్రవ రూపంలోకి మారి, ఒక చైనీస్ డ్రాగన్‌లా మెలికలు తిరుగుతూ పైకి పాకుతుంది. ఆ వచ్చే తెల్లటి పొగను ఒక పైప్ ద్వారా పీలుస్తారు. ఆ పొగ పైకి వెళ్తుంటే... డ్రగ్ అడిక్ట్స్ దాన్ని వదలకుండా పీల్చడానికి ఆ పొగ వెనుక పరిగెడతారు. అందుకే ఈ ప్రాసెస్‌కు 'Chasing the Dragon' (డ్రాగన్‌ను వేటాడటం) అనే పేరు వచ్చింది. అందుకే ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ పెట్టారని అర్థమవుతోంది. అంతర్జాతీయ క్రైమ్ వరల్డ్‌లో 'డ్రాగన్' అనేది అపరిమితమైన పవర్, డిస్ట్రాక్షన్ (విధ్వంసం)కు చిహ్నంగా భావిస్తారు. ఈ డ్రగ్ తీసుకునేటప్పుడు మెదడుకు వచ్చే ఆ ఊహాజనిత కిక్ కోసం అడిక్ట్స్ ఎంతటి దారుణమైన క్రైమ్ చేయడానికైనా వెనకాడరు. ఒక్కసారి ఆ డ్రాగన్ ట్రాప్‌లో పడ్డారా ఇక జీవితం ముగిసిపోయినట్లే. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ అండ్ డార్క్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లలో ఆడియన్స్ సీట్ల అంచున కూర్చోవడం ఖాయం. ఒక చిన్న మొక్క ప్రపంచాన్ని శాసించే అంతర్జాతీయ మాఫియాగా ఎలా మారింది అనేది నిజంగానే ఒక పవర్ఫుల్ సినిమా స్క్రిప్ట్‌కు పర్ఫెక్ట్ మెటీరియల్. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో కేజీఎఫ్ కోసం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, సలార్ కోసం ఖాన్సార్ వంటి డార్క్ వరల్డ్‌లను సృష్టించినట్లే, ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో ఈ ఓపియం పాపీ చేసింగ్ ది డ్రాగన్ నెట్‌వర్క్‌ను హీరో ఎలా చేదించాడు, ఆ పాయిజనస్ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడు అనేది చూపించబోతున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన చీఫ్ అస్సాసిన్ 'లూగర్' (Luger) పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ రగ్గడ్ అండ్ వయోలెంట్ లుక్ గ్లింప్స్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా విజువల్ వండర్ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
May 23, 2026 4:37PM
Rukmini Vasanth: వైరల్ బికినీ ఫోటోలపై నోరు విప్పిన రుక్మిణి వసంత్!
తక్కువ కాలంలోనే సౌత్ ఇండియా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). ముఖ్యంగా 'సప్త సాగరదాచే ఎల్లో' సినిమాలో ప్రియ అనే సాంప్రదాయబద్ధమైన పాత్రలో ఆమె చూపించిన హావభావాలు, పలికించిన పద్ధతికి తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్స్ అయిన 'టాక్సిక్', 'డ్రాగన్' సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోంది. అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని షాకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర సంచలనం సృష్టించింది. రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రుక్మిణి వసంత్ బికినీ ధరించినట్లు ఉన్న కొన్ని ఫోటోలు, చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ విపరీతంగా షేర్ అయ్యాయి. నిన్నటివరకు హోమ్లీ లుక్‌లో చూసిన తమ అభిమాన కథానాయికను ఇలాంటి బోల్డ్ అవతారంలో చూసేసరికి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు ఆమె గ్లామర్ లుక్‌ను అభినందిస్తూ కామెంట్లు పెట్టగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఈ ఫోటోల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంటర్నెట్లో ఈ రచ్చ కాస్తా ముదరడంతో, ఎట్టకేలకు ఈ వివాదంపై స్వయంగా రుక్మిణి వసంత్ క్లారిటీ ఇచ్చారు. ఆ వైరల్ అవుతున్న బికినీ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించి సృష్టించిన మార్ఫింగ్ ఫోటోలని ఆమె స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండా, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ కొందరు ఆకతాయిలు కావాలనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కంటెంట్ తనను ఎంతగానో మానసిక వేదనకు గురిచేసిందని, దీనిపై తన లీగల్ టీమ్ ఇప్పటికే అప్రమత్తమైందని తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. సినిమా స్టార్స్‌ను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న ఈ ఏఐ డీప్‌ఫేక్ (AI Deepfake) సంస్కృతిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏఐ మార్ఫింగ్ ముఠాల పట్ల సైబర్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, సెలబ్రిటీల ప్రైవసీని కాపాడేందుకు కొత్త చట్టాలు తీసుకురావాలని పరిశ్రమ వర్గాల నుండి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. https://x.com/rukminitweets/status/2058069100765810878
May 23, 2026 1:23PM
Dragon: డ్రాగన్ మాస్టర్ ప్లాన్ లీక్!.. ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు భయ్యా
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)వన్ మాన్ షో డ్రాగన్(Dragon)గ్లింప్స్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే 64 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి ఫిలింనగర్ వర్గాల నుండి ఒక తాజా సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కేవలం ఒక్క భాగంతో ముగించకుండా, ఏకంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి ప్రశాంత్ నీల్ సిద్ధం చేసిన సుదీర్ఘమైన, ఎమోషనల్ మైండ్ బ్లోయింగ్ కథ ఒక్క భాగంలో సరిపోదని భావించిన చిత్ర యూనిట్, దీనిని రెండు భాగాలుగా విస్తరించాలని నిర్ణయించింది. బాహుబలి, కేజీఎఫ్, సలార్, పుష్ప చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా రెండు భాగాల ఫ్రాంచైజీగా రాబోతుండటం ఎన్టీఆర్ అభిమానులకి అసలైన పూనకాలు తెప్పిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే సలార్ లా లేటు ఉండకుండా డ్రాగన్ మొదటి భాగం తెరకెక్కిస్తున్నప్పుడే రెండో భాగం కూడా తెరకెక్కిస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. Also read: Naga chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో చైతు క్రేజీ ప్రాజెక్ట్! ఫ్యాన్స్ రియాక్షన్ వింటే షాక్ అవుతారు డ్రాగన్ ని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ జత కడుతుంది.
May 22, 2026 4:59PM
రుక్మిణి వసంత్ బికీనీ వీడియో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'డ్రాగన్' బ్యూటీ బోల్డ్ లుక్!
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ 'డ్రాగన్' (Dragon) సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆమె లుక్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ అవుతోంది. వెండితెరపై ఎంతో పద్ధతిగా, హోమ్లీ లుక్‌లో కనిపించి కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈ 29 ఏళ్ల బెంగళూరు భామ.. తాజాగా ఊహించని విధంగా అత్యంత గ్లామరస్ అవతారంలో దర్శనమిచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. పూల్‌సైడ్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రీన్ కలర్ బికీనీ ధరించి కెమెరాలు, షూటింగ్ సిబ్బంది మధ్య ఆమె ఉన్న ఒక స్పెషల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో వేలాది వ్యూస్, లైకులను సాధించి విపరీతంగా వైరల్ అవుతోంది. రుక్మిణి వసంత్ కెరీర్లోనే ఇలాంటి ఒక అల్ట్రా బోల్డ్ బికీనీ లుక్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో, నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ గ్రీన్ బికీనీ వీడియో చూసిన అభిమానులు రుక్మిణి వసంత్ గ్లామర్ అప్పీల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడూ చీరకట్టులో, సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో చూసిన తమ అభిమాన నటిని ఈ రేంజ్ హాట్ అవతారంలో చూసేసరికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే, ఈ వీడియోపై ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో భిన్నమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో, ఇది ఎవరైనా సృష్టించిన ఏఐ డీప్‌ఫేక్ వీడియో కావచ్చు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం రుక్మిణికి చీరకట్టు, ట్రెడిషనల్ లుక్సే ఎంతో అందంగా ఉంటాయని.. ఇలాంటి బోల్డ్ లుక్స్ ఆమెకు సెట్ కావు అంటూ అభిప్రాయపడుతున్నారు.
May 22, 2026 4:37PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






