
Mahesh Babu: ‘వారణాసి’కి ముందే మాస్ జాతర.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ (Varanasi) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ స్టార్ గా అవతరించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే ‘వారణాసి’ సినిమా రావడానికి ముందే ఈ ఏడాది మహేష్ అభిమానులకు డబుల్ ట్రీట్ అందనుంది. బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన మహేష్ బాబు కెరీర్‌లోని రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఒకే రోజు థియేటర్లలో రీ-రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. లెజెండరీ యాక్టర్, సూపర్‌స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్ల ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ న్యూస్ విన్న ఘట్టమనేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన కల్ట్ క్లాసిక్ ‘పోకిరి’, అలాగే సరికొత్త కలెక్షన్ల రికార్డులు సృష్టించిన ‘దూకుడు’ చిత్రాలు ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు(ఆగస్టు 9) వేడుకలకు ముందే, ఆయన బర్త్ డే కానుకగా ఈ డబుల్ ధమాకా థియేటర్లను షేక్ చేయబోతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ భారీ ప్లాన్ చేయడం గమనార్హం. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్. ఇందులో మహేష్ బాబు ‘పండు గాడు’ అనే అండర్‌కవర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించారు. ఈ సినిమాలోని డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాకుండా మణిశర్మ అందించిన 'జగడమే', 'డోలే డోలే' వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్ అప్పట్లో యూత్‌ను ఒక ఊపు ఊపాయి. ఇప్పుడు మరోసారి ఈ చిత్రాన్ని 4K క్వాలిటీతో థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, కమర్షియల్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు’ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ‘అజయ్ కుమార్’ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా తనదైన కామెడీ టైమింగ్‌తో, యాక్షన్‌తో మెప్పించారు. అప్పట్లోనే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఈ చిత్రం టాలీవుడ్లో సరికొత్త మైలురాయిని క్రియేట్ చేసింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలోకి భారీ ఎత్తున తీసుకువస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న గ్లోబల్ మూవీ ‘వారణాసి’ రాకముందే, పాత జ్ఞాపకాలను వెండితెరపై నెమరవేసుకుంటూ ఒకే రోజున రెండు భారీ హిట్ చిత్రాలను రీ-రిలీజ్ చేస్తుండటంతో థియేటర్ల వద్ద అభిమానుల హంగామా నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. https://x.com/14ReelsPlus/status/2060955333489824074
Jun 1, 2026 11:12AM
హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ రీఎంట్రీ.. నిర్మాతతో చేతులు కలిపిన స్టార్ హీరోలు!
హైదరాబాద్ నగర సినీ ప్రియులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది నిజంగానే అదిరిపోయే గుడ్ న్యూస్. 12 ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడబోతోంది. నగరంలో ఒరిజినల్, లైసెన్స్డ్ ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్ పునరాగమనం చేయబోతోంది. ఒకప్పుడు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐమ్యాక్స్ 70mm ప్రొజెక్టర్ స్క్రీన్ ఉండేది. అయితే, కొన్ని సాంకేతిక కారణాలు మరియు డిజిటల్ ఫార్మాట్ మార్పుల వల్ల 2014వ సంవత్సరంలో ఈ ఐమ్యాక్స్ స్క్రీన్‌ను పూర్తిగా తొలగించి, సాధారణ పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్‌గా మార్చేశారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోని మూవీ లవర్స్ అంతా ఒక పవర్ఫుల్ ఐమ్యాక్స్ స్క్రీన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ నిరీక్షణకు స్వస్తి పలుకుతూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత ఏషియన్ సునీల్ నారంగ్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ లో సరికొత్త లైసెన్స్డ్ ఐమ్యాక్స్ స్క్రీన్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ మెగా ప్రాజెక్ట్‌లో ఏషియన్ సునీల్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా భాగస్వాములుగా చేరడం ఇండస్ట్రీ వర్గాల్లో మరింత హాట్ టాపిక్ గా మారింది. హీరోల భాగస్వామ్యంతో ఇప్పటికే పలు మల్టీప్లెక్స్‌లను నిర్మించిన ఏషియన్ గ్రూప్, ఈ సరికొత్త ఐమ్యాక్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటిలను భాగస్వాములుగా రంగంలోకి దించుతోంది. టాలీవుడ్లో ప్రస్తుతం వారణాసి, రాకా వంటి విజువల్ వండర్స్ మరియు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఇలాంటి క్రేజీ సినిమాలను సరైన లార్జ్ ఫార్మాట్లో ఎక్స్ పీరియన్స్ చేయాలంటే ఐమ్యాక్స్ స్క్రీన్ అత్యంత అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, హకీంపేట్ ఏరియా సమీపంలో ఒక భారీ లేజర్ ఐమ్యాక్స్ థియేటర్‌ను నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. గత 12 ఏళ్లుగా హైదరాబాద్ సినిమా ప్రేక్షకులు కోల్పోయిన ఐమ్యాక్స్ ఎక్స్‌పీరియన్స్‌ను మళ్లీ తిప్పితీసుకురావడానికి ఏషియన్ సునీల్ అండ్ టీమ్ గట్టి ప్లానే వేసింది. ఈ సరికొత్త థియేటర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
May 30, 2026 9:24AM
Varanasi: వారణాసి నుంచి మరో లీక్.. ఉగ్రాభట్టి గుహల వీడియో నెట్టింట్లో
ఇండియన్ సినిమా గొప్పతనాన్ని ప్రపంచ సినిమాకి చాటి చెప్పాలనే లక్ష్యంతో తెరకెక్కుతున్న 'వారణాసి'(Varanasi)షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి లీకుల బెడద ఎక్కువయ్యింది. కొన్ని రోజుల క్రితం ఒడిస్సాలో జరిగిన తొలి షెడ్యూల్ సీన్స్ లీక్ అవ్వగా ఇప్పుడు "ఉగ్రాభట్టి గుహల" సీక్వెన్స్‌కి సంబంధించిన భారీ సెట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఆ లీక్డ్ ఫోటోని పరిశీలిస్తే, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం ఉపయోగించే భారీ బ్లూ స్క్రీన్ బ్యాక్‌డ్రాప్ గా ఉండటంతో పాటు దాని చుట్టూ అద్భుతంగా చెక్కబడిన రాతి నిర్మాణాలు, అత్యంత సంక్లిష్టమైన రాతి స్తంభాల రూపకల్పన ఉంది. ఈ ఒక్క లీక్‌తోనే రాజమౌళి ఎలాంటి విజువల్ వండర్ని ప్లాన్ చేస్తున్నారో అర్థమైపోతోంది. అయితే ఈ లీక్డ్ పిక్చర్లో చిత్ర నటీనటులు ఎవరూ కనిపించనప్పటికీ, ప్రొడక్షన్ డిజైన్ యొక్క అసాధారణమైన స్కేల్ స్పష్టంగా వెల్లడవుతోంది. Also read: Dhurandhar: ధురంధర్ సిరీస్ కాస్టింగ్.. ఎంపికైన తొలి నటుడు ఇతనే ఈ ఉగ్రాభట్టి గుహల సీక్వెన్స్ వెనుక ఒక బలమైన పౌరాణిక కనెక్షన్ ఉన్నట్లు సమాచారం. హిందూ పురాణాలలో తీవ్రమైన ఆత్మత్యాగానికి, పరివర్తనకి ,బ్రహ్మాండమైన సమతుల్యతకు ప్రతీకగా నిలిచే 'మాతా ఛిన్నమస్తా దేవి' చుట్టూ ఈ ఎపిసోడ్ తిరుగుతుందని తెలుస్తోంది. సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న 'రుద్ర' అనే క్యారెక్టర్, ఒక ప్రాచీనమైన మరియు అత్యంత శక్తివంతమైన కాస్మిక్ ఆర్టిఫాక్ట్ (గ్రహాంతర/ప్రాచీన వస్తువు) కోసం అన్వేషిస్తూ ఈ భయంకరమైన గుహల్లోకి ప్రవేశిస్తాడట. అక్కడ విశ్వాన్ని అతలాకుతలం చేయాలని చూసే ఒక పురాతన దుష్ట శక్తిని అంతం చేయడానికి ఆ దేవి దివ్య అనుగ్రహాన్ని కోరతాడనేది ఈ సీన్ సారాంశం.రాజమౌళి ఎంతో రహస్యంగా ఉంచాలనుకున్న ఈ సెట్ తాలూకు విజువల్స్ బయటకు రావడం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
May 29, 2026 7:16PM
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్
1. ఎట్టకేలకు బుల్లితెరపైకి దేవర జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'దేవర' శాటిలైట్ హక్కులకు సంబంధించిన డీల్ ఎట్టకేలకు క్లోజ్ అయింది. థియేటర్లలో విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఇంతవరకు ఈ సినిమా టీవీలో ప్రసారం కాకపోవడం విశేషం. ఈ సినిమాను బుల్లితెరపై చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రముఖ టీవీ నెట్వర్క్ 'ఈటీవీ', ఈ సినిమా శాటిలైట్ హక్కులకు సొంతం చేసుకుంది. భారీ ధరకే ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ కాంబోకు సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే ప్రారంభమైనట్లు న్యూస్ వినిపిస్తోంది. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' సినిమా చేస్తుండగా.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 3. 'పెద్ది' సినిమాకు రూట్ క్లియర్ మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ మూవీ 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది. థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ సిస్టమ్‌పై చర్చలు జరుగుతున్నా.. తెలంగాణలో ఈ సినిమా పాత రెంటల్ విధానంలోనే రిలీజ్ కాబోతోంది. ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో పర్సంటేజ్ సిస్టమ్ అమలుకు సంబంధించిన నిబంధనలపై చర్చలు సాగుతున్నాయి. అన్ని విషయాలను క్షుణ్ణంగా సమీక్షించి రాబోయే జులై నెల నుండి కొత్త పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. 4. మంచు మనోజ్ కాదు.. మంచి మనోజ్ మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ లోని 'మాతృదేవోభవ' అనాథాశ్రమాన్ని సందర్శించారు. సోషల్ మీడియాలో ఆశ్రమ నిర్వాహకులు పెట్టిన వీడియో చూసి చలించిన ఆయన, అక్కడ మతిస్థిమితం లేని ఒక వ్యక్తికి స్వయంగా కటింగ్ చేసి, కొత్త బట్టలు అందించారు. ఆశ్రమానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలను విరాళంగా ఇవ్వడంతో పాటు భవిష్యత్తులోనూ తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. 5. పెద్దికి అంకితమైపోయిన అప్పలసూరి 'పెద్ది' సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు 'అప్పలసూరి' అనే పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తన డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నట్లు జగపతి బాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. డబ్బింగ్ స్టూడియోలో దర్శకుడు బుచ్చిబాబు పర్యవేక్షణలో సాగుతున్న ఈ డబ్బింగ్ వీడియోను షేర్ చేస్తూ.. "పెద్దికి అంకితమైపోయిన అప్పలసూరి" అని ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. 6. 'ది డర్టీ పిక్చర్'లో చూపించింది అబద్ధం నాటి గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత తనను కొట్టిందంటూ చాలాకాలంగా ప్రచారంలో ఉన్న వివాదంపై నటి షకీలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. 'ది డర్టీ పిక్చర్' సినిమాలో చూపించినట్లుగా తామిద్దరం ఎప్పుడూ ప్రత్యర్థులం కాదని, సిల్క్ స్మిత తనకు ఎంతో ఆత్మీయురాలని షకీలా స్పష్టం చేశారు. ఒక సినిమా షూటింగ్ సీన్లో భాగంగా సిల్క్ స్మిత తనను నిజంగానే గట్టిగా తన్నాల్సి వచ్చిందని, అయితే షాట్ పూర్తయిన వెంటనే ఆమె తనను కౌగిలించుకుని ఓదార్చిందని షకీలా చెప్పారు. 7. చేతులు కలిపిన థమన్, అనిరుధ్ ఎస్.ఎస్. థమన్, అనిరుధ్ రవిచందర్ కలయికపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'మిత్రమా ఇక మొదలెడదామా' అంటూ అనిరుధ్‌ను ట్యాగ్ చేస్తూ.. థమన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఇద్దరి కాంబోలో ఏదో పెద్ద ప్రాజెక్ట్ రాబోతోందని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని, థమన్ సంగీతం అందిస్తున్న ఒక సినిమాలో అనిరుధ్ కేవలం ఓ పాట పాడుతున్నట్లు సమాచారం. 8. త్వరలోనే 'కరుప్పు' సీక్వెల్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'కరుప్పు' ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్లో పాల్గొన్న సూర్య.. ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. 'కరుప్పు 2' ప్రాజెక్ట్ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, దీనికి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే వెల్లడవుతాయని సూర్య పేర్కొన్నారు. 9. సీఎం విజయ్ సంచలన నిర్ణయం తమిళ సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి విజయ్ గుడ్ న్యూస్ చెప్పారు. తమిళనాడులో రోజుకు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చారు. జూన్ ఫస్ట్ నుండి ఇది అమలులోకి రానుంది. ఈ నిర్ణయం పట్ల కోలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య ప్రేక్షకుడిపై అదనపు టికెట్ రేట్ల భారం పడకుండా, కలెక్షన్లు పెంచుకునేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 10. ధురంధర్ హీరోపై బాలీవుడ్ బ్యాన్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ తలపెట్టిన 'డాన్ 3' ప్రాజెక్ట్ నుండి బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభానికి ముందు ఆయన తప్పుకోవడంతో.. ప్రీ-ప్రొడక్షన్ దశలో నిర్మాతలకు దాదాపు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నేపథ్యంలో 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్' రణ్‌వీర్‌పై నాన్-కోఆపరేషన్ ఆదేశాలు జారీ చేస్తూ బ్యాన్ విధించింది. ఇరువర్గాలు త్వరలోనే చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
May 26, 2026 3:49PM
Mahesh Babu: మహేశ్, ప్రశాంత్ నీల్ ఊహించని కాంబో.. క్రేజీ అప్డేట్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu),ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని, ఇండస్ట్రీ వర్గాలని ఊపేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రాథమిక చర్చలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ కాంబో గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సినీ ప్రియులు, అభిమానులు మాత్రం ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ పవర్ఫుల్ ఎలివేషన్స్, అద్భుతమైన స్టోరీ నరేషన్, మహేశ్ వన్ మ్యాన్ షో స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)తో చేస్తున్న 'డ్రాగన్'(Dragon)తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధించి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో 'సలార్ 2' సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తన మార్క్ డార్క్ టోన్, నియో నాయర్ యాక్షన్ సినిమాలకి కొంత విరామం ఇచ్చి, మైథాలజికల్ లేదా డిఫరెంట్ జానర్ వైపు అడుగులు వేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ సరికొత్త ప్రయోగంలో భాగంగానే మహేశ్ బాబు కోసం ఒక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మహేశ్ ప్రస్తుతం గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్వ రల్డ్ మూవీ 'వారణాసి'(Varanasi)షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 'వారణాసి' తర్వాత మహేశ్ బాబు, సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ నుంచి వచ్చిన సరికొత్త ప్రపోజల్ మహేశ్ బాబుని ఆలోచనలో పడేసిందని, మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. Also read: VIJay: సీఎం విజయ్‌పై సముద్రఖని సంచలన వ్యాఖ్యలు..ఏం అర్హత ఉందో ఇప్పుడు అర్థమైందా! అయితే ఈ ఊహించని కాంబో పట్టాలెక్కడానికి కనీసం మూడేళ్ళ సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే మహేశ్ బాబు 'వారణాసి' ప్రాజెక్ట్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ కూడా 'డ్రాగన్', 'సలార్ 2', మరియు హోంబాలే ఫిలిమ్స్‌తో ఉన్న ఒప్పందాల ప్రకారం 'కేజీఎఫ్ 3' లాంటి భారీ కట్టుబాట్లని పూర్తి చేయాలి. ఒకవేళ వీరద్దరి షెడ్యూల్స్ అన్నీ అనుకూలించి, కథ లాక్ అయితే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కావడం ఖాయం.
May 26, 2026 3:30PM
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం
ఎప్పటికప్పుడు తెలుగు సినిమా న్యూస్ సరికొత్త క్రేజీ అప్ డేట్ తో మీ ముందు ఉంటున్నాయి. మరి ఈ క్రేజీ న్యూస్ ఏంటో చూసేద్దాం 1 . హెల్లాల్లల్లో సాంగ్ రికార్డ్స్ మొన్న 23 న భూపాల్ సాక్షిగా పెద్ది నుంచి 'హెల్లాల్లల్లో' సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. అలా విడుదలైందో లేదో రికార్డులే నా చిరునామా అంటూ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 18 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక ప్రాంతీయ సినిమా నుంచి వచ్చిన సాంగ్ హిందీ, సౌత్ భాషల యూట్యూబ్ ట్రెండింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం పెద్ది స్టామినా ఏ పాటిదో తెలియచేస్తుంది. 2 . కోకాపేటలో ప్రభాస్ డ్రీమ్ హౌస్.. ఎకరం ధర వింటే షాక్ అవ్వాల్సిందే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ కోకాపేట ఏరియాలో తన సరికొత్త డ్రీమ్ హౌస్ నిర్మాణ పనులని అధికారికంగా ప్రారంభించారు. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్స్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండగా భారీ హోమ్ థియేటర్, అత్యాధునిక జిమ్నేషియం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.రెండు ఎకరాల్లో నిర్మాణం జరుపుకోనుండగా ఎకరం భూమి విలువ దాదాపు 150 కోట్లకి పైగా ఉంది. అంటే కేవలం ఆయన కొనుగోలు చేసిన ఈ రెండు ఎకరాల ఖాళీ స్థలం విలువే 300 కోట్లు. ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ గా నిర్మాణం జరుపుకోనుంది 3 . బండ్ల గణేష్‌ని చెప్పుతో కొట్టిన టాలీవుడ్ ప్రముఖుడు.. ఫ్యాన్స్ షాక్ బండ్ల గణేష్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు స్టార్ హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజే నా జీవితంలో చేదు సంఘటన జరిగింది. షూటింగ్ స్పాట్లో ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ పెద్దమనిషి పక్కన కూర్చున్నాను. నేను “సార్' అని పిలవగానే సదరు పెద్ద మనిషి చెప్పు తీసుకుని నన్ను కొట్టాడు. అయితే ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. నా దగ్గర డబ్బు లేదు. నేను బలహీనుడిని కాబట్టే నన్ను అలా అవమానించారనిపించింది. బయటకు వచ్చిన తర్వాత నాతో ఉన్న వ్యక్తితో ఒక మాట చెప్పాను. ఒక రోజు ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తా.. లేదంటే నా పేరు గణేష్ కాదు అని. గణేష్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 4 . పెద్ది వివాదంపై రంగంలోకి చిరంజీవి పెద్ది' నుంచే మాకు పర్సెంటేజ్(రెవెన్యూ షేరింగ్) సిస్టంని అందుబాటులోకి తీసుకురావాల్సిందే, లేదంటే ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరని తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీర్మానించిన విషయం తెలిసిందే. దీంతో మరో వారం రోజుల్లో పెద్ది రిలీజ్ ఉండటంతో ఫ్యాన్స్ సినీ ప్రేమికుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సమస్యని పరిష్కరించడానికి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ రోజు సాయంత్రం చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్స్ తో సమావేశం జరగనుంది. 5 .వారణాసి క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కాలర్ ఎత్తాల్సిందే మహేష్ బాబు, రాజమౌళిల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం "వారణాసి" (Varanasi). ఈ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూన్ రెండో వారం నుంచి మూవీకి అత్యంత కీలకమైన సుదీర్ఘ యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కంటిన్యూగా నెల రోజుల పాటు జరగనున్నట్టుగా సమాచారం 6 .పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'పంజా' ని రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకి గురవుతున్నారు. 'పంజా' లో పవన్ లుక్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దాంతో చాలా మంది పవన్ అభిమానులు 'బద్రి' నే రీ రిలీజ్ చెయ్యాలని అభిప్రాయపడుతున్నారు. 7 . రోబోలు వచ్చే కాలంలో పిల్లలెందుకు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ వంటి టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. కళ్లముందే కలియుగం కనిపించడంతో పాటు భవిష్యత్తు కాలం చాలా భయంకరంగా మారబోతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులున్న సమాజంలోకి కేవలం మన స్వార్థం, సంతోషం కోసం పిల్లలని తీసుకురావడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చాడు. 8 .పెద్దిపై పోసాని షాకింగ్ కామెంట్స్ పోసాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ది’ రిలీజ్ కి అటుఇటుగా నా కొత్త సినిమా 'ఆపరేషన్ అరుణా రెడ్డి' రిలీజ్ కానుంది. అయితే చరణ్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. 9 .ఫ్లాప్ హీరోలకి కూడా వందల కోట్లు బడ్జెట్ అంటున్న తమ్మారెడ్డి పరిశ్రమలో ఎప్పుడైనా సరే కేవలం ఐదు శాతం సినిమాలు మాత్రమే లాభాలను తెచ్చిపెడతాయని, మిగిలిన తొంభై ఐదు శాతం చిత్రాలు నష్టాలనే మిగులుస్తాయని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెబుతున్నారు. ముఖ్యంగా హీరోల పారితోషికాల విషయంలో నిర్మాతల వైఖరి మారాలి. వరుస ఫ్లాపులు ఇస్తున్న హీరోలకి సైతం వందల కోట్ల బడ్జెట్ కేటాయించి, భారీగా రెమ్యునరేషన్లు ఇస్తున్న నిర్మాతలు నేడు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పుకొచ్చాడు 10 .శ్రీను వైట్ల, శర్వానంద్ తో విశ్వంభర భామ! దర్శకుడు శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబోలో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ ని ఫిక్స్ చేసినట్లుగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న తాజా న్యూస్ . ఈ సంక్రాంతికి రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తితో మెప్పించిన ఆషికా,మెగా స్టార్ విశ్వంభరలో కనువిందుచేయనున్న విషయం తెలిసిందే.
May 25, 2026 2:58PM
Varanasi: 'వారణాసి' నుండి క్రేజీ అప్డేట్.. మహేష్ కోసం జక్కన్న భారీ ప్లాన్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ 'వారణాసి' (Varanasi) గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ హల్చల్ చేస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి జూన్ రెండో వారం నుండి అత్యంత కీలకమైన, సుదీర్ఘమైన యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్లో మహేష్ బాబుపై అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే సుమారు నెలకు పైగా నాన్-స్టాప్ షూటింగ్ సాగనుండటం విశేషం. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే శ్రీరాముడిగానూ కనువిందు చేయనున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్ ఫుల్ నెగటివ్ రోల్ చేస్తుండగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో 'మందాకిని' అనే కీలక పాత్రలో నటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి తీసుకురానున్నారు మేకర్స్. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన రాజమౌళి, ఈసారి మహేష్ బాబుతో కలిసి సరికొత్త గ్లోబల్ వండర్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
May 25, 2026 10:51AM
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్..
1. ఒకే ఫ్రేమ్‌లో 'మెగా బ్రదర్స్'.. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి కాంబినేషన్లో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక చిత్రం 'మెగా 158 ' పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ మూవీ లాంచ్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చాలాకాలం తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు.. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకే వేదికపై, ఒకే ఫ్రేమ్‌లో నవ్వుతూ కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ అపురూప దృశ్యానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 2. 'దృశ్యం 3' మూవీ రివ్యూ! ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్రేజీ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం 3' థియేటర్లలోకి వచ్చి డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. డైరెక్టర్ అక్కడక్కడా కొన్ని టెన్షన్ సీన్స్‌తో సినిమా మూడ్‌ను బిల్డ్ చేయడంలో సక్సెస్ అయినప్పటికీ.. ఓవరాల్‌గా కథనం ఫ్లాట్‌గా, చాలా సాధారణంగా సాగిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. క్లైమాక్స్ సీక్వెన్స్ కొంతవరకు పర్వాలేదనిపించినా.. మిగతా సినిమా అంతా సాగతీతగా, రొటీన్‌గా అనిపిస్తుందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. 3. చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్! ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' సరికొత్త రికార్డులతో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రీసెంట్గా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్ లో విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్, లైక్స్‌తో సరికొత్త రికార్డులను సృష్టించింది. 64 మిలియన్లకు పైగా వ్యూస్ తో.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్ గా 'డ్రాగన్' నిలిచింది. 4. 'స్పిరిట్' క్రేజీ అప్డేట్! ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' సరికొత్త షెడ్యూల్ మే 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రేజీ షెడ్యూల్లో హీరో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి కూడా జాయిన్ కాబోతున్నారు. ఈ షెడ్యూల్లోనే ప్రభాస్, త్రిప్తి డిమ్రి కాంబినేషన్లో వచ్చే కొన్ని కీలకమైన సీన్స్‌ను మేకర్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 5. 'ఉప్పెన' కంటే 100 రెట్లు షాకింగ్ ట్విస్ట్! రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్ సినిమాపై ఒక సంచలన లీక్ ఇచ్చారు. ఈ చిత్రంలోని "ఢిల్లీ ఎపిసోడ్" తనకు అత్యంత ఇష్టమైన భాగమని, అక్కడే కథను మలుపు తిప్పే అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుందని చరణ్ పేర్కొన్నారు. అంతేకాదు, బుచ్చిబాబు మొదటి సినిమా 'ఉప్పెన' క్లైమాక్స్ ట్విస్ట్ కంటే ఈ ట్విస్ట్ 100 రెట్లు ఎక్కువ షాకింగ్‌గా, ఊహకందని విధంగా ఉంటుందని చరణ్ చెప్పారు. 6. 'వారణాసి' సాంగ్ కోసం స్పెషల్ సెట్! మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో గ్లోబల్ రేంజ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' సరికొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కాటేదాన్ (Katedan) ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ సాంగ్ షూటింగ్ నడుస్తోంది. మహేష్ బాబుపై చిత్రీకరిస్తున్న ఈ క్రేజీ సాంగ్ కోసం మేకర్స్ అక్కడ ఒక ప్రత్యేకమైన సెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. 7. రియల్ హీరో అనిపించుకున్న రామ్ పోతినేని! ఎలాంటి హంగు ఆర్భాటాలు, మీడియా హడావుడి లేకుండా రామ్ పోతినేని నేరుగా ఓ వీరాభిమాని ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత 18 ఏళ్లుగా 'ఫ్రెడ్రిచ్ అటాక్సియా' అనే అరుదైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతున్న ఓ యువతి.. తనను ఒక్కసారైనా చూడాలని కోరుకుంటున్న విషయం తెలిసి రామ్ వెంటనే స్పందించారు. ఎలాంటి ప్రచారం ఆశించకుండా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి, ఆమె పక్కనే కూర్చుని ఆప్యాయంగా పలకరించి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. 8. అప్పుడే ఓటీటీలోకి 'వీరభద్రుడు' రీసెంట్గా రిలీజై బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సూర్య లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వీరభద్రుడు' అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'నెట్‌ఫ్లిక్స్' భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రేజీ డీల్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు రూ. 35 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఉండే నాలుగు వారాల విండో రూల్ ప్రకారం ఈ చిత్రం జూన్ రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. 9. 'కుర్చీ తాత' కన్నుమూత! ‘కుర్చీ మడతపెట్టి’ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగిన 'కుర్చీ తాత' అలియాస్ మహ్మద్ పాషా కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. తీవ్ర వడదెబ్బ కారణంగా ఆయన కన్నుమూసినట్లు సమాచారం. 10. SRH ఓనర్ తో అనిరుధ్ పెళ్లి? స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్ గ్రూప్ వారసురాలు కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో మళ్ళీ వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ రూమర్స్‌పై అనిరుధ్ స్పందిస్తూ.. ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ వార్తలు ట్రెండ్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.
May 21, 2026 3:21PM.webp)
పర్శంటేజ్ సిస్టం నుంచి మినహాయింపు కోరిన 17 సినిమాలు
అందరం పుట్టింది.. బతుకుతుంది.. ఎదుగుతుంది తెలుగు సినిమా వలనే అనే విషయం తెలిసి కూడా కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య పర్శంటేజ్ విషయంలో ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది. విచిత్రం ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నా కూడా కరెక్టే కదా వాళ్ళు మాట్లాడేది అనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే వివాదం మరింత ముదరడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగింది. ఇరు వర్గాల మధ్య సమన్వయం కుదర్చడానికి, సమస్యకి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి పదిహేను మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వనుంది. ఈ మొత్తం వివాదంలో మరో ఆసక్తికరమైన కీలకమైన మలుపు చోటుచేసుకుంది. పర్సంటేజ్ సిస్టమ్ వివాదం ఎలా ఉన్నప్పటికీ, ఇప్పటికే భారీ అంచనాలతో, వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సుమారు పదిహేడు క్రేజీ ప్రాజెక్టులకి ఈ వివాదం నుండి ఊరట లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 17 సినిమాల జాబితాలో పెద్ది, డ్రాగన్ , విశ్వంభర, హనుమన్ 2 , కల్కి 2', స్పిరిట్', వారణాసి, ది ప్యారడైజ్, రాకా, ఎన్ బి కె 111 , మెగా 158 ,రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ, ఏ కె 47 ,నాని, సుజిత్ కాంబో, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో, అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీ ఇలా సుమారు 17 చిత్రాలకి పర్శంటేజ్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. Also read: Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్ బిల్లు వైరల్.. వాటర్ బాటిల్ రేటు చూస్తే షాకవుతారు ఈ పెద్ద సినిమాల థియేట్రికల్ బిజినెస్ మరియు అడ్వాన్స్‌లు ఇప్పటికే పాత పద్ధతిలోనే జరిగాయని, కాబట్టి వీటిని ప్రస్తుత వివాదం నుండి పక్కన పెట్టాలని ఇరు వర్గాలు ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ మినహాయింపు జాబితా వల్ల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల విడుదలకి ఎలాంటి ఆటంకం కలగదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా థియేటర్ల మనుగడ ముఖ్యం, అలాగే నిర్మాతల పెట్టుబడి సేఫ్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. ఈ ఫ్యామిలీ సమస్యని టాలీవుడ్ పెద్దలు త్వరలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తారని ప్రేక్షకులు మరియు సినిమా ప్రేమికులు ఆశిస్తున్నారు.
May 16, 2026 11:57AM
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్
తగ్గేదేలే అనే రీతిలో పలు ఆసక్తికర తెలుగు సినిమా వార్తలు తెలుగు సినిమా ప్రేమికులు, పాఠకుల కోసం అందుబాటులో ఉన్నాయి. 1 . నాగార్జున విషయంలో హైకోర్ట్ కీలక తీర్పు.. అనుమతి పత్రాలు చూపండి అని ఆదేశాలు నా పేరుతో టీ షర్ట్స్ ని ఒక సంస్థ విక్రయిస్తుందని కొన్ని రోజుల క్రితం నాగార్జున ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు స్పందిస్తు నాగార్జునతో నేరుగా ఒప్పందం లేనప్పుడు ఆయన పేరు, ఫోటోలని వాడుకుంటూ టీ షర్టులు ఎలా అమ్ముతారు. మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా హక్కులు పొందామని చెప్తే సరిపోతుందా! ప్లెయింటిఫ్ తో మీకు పరిచయం కూడా లేనప్పుడు ఆ వస్తువులని అమ్మే చట్టబద్ధత మీకు ఎక్కడి నుంచి వచ్చింది. అనుమతి పాత్రలు ఉన్నాయా అని ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 2. విజయ్ ఇక సెకండ్ ప్లేస్ లోనే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో తనకంటు ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్న దళపతి విజయ్ మరో అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. ప్రముఖ సినిమా వెబ్ సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాలో విజయ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు వారంలో 21 వ స్థానంలో ఉన్న విజయ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం. 3 . భోపాల్‌లో ‘పెద్ది’ సౌండ్.. థర్డ్ సాంగ్ లాంచ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది నుంచి తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కి సంబంధించిన శుభవార్త బయటకు వచ్చింది. 'సౌండ్ ఆఫ్ పెద్ది' పేరుతో మే 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో స్పెషల్ సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్లో రెహమాన్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన స్వరపరిచిన బాణీలకి స్టేజ్ పై లైవ్ మ్యూజిక్ తోడైతే, ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే. 4 . బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టీస్టారర్! గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మల్టిస్టారర్ చెయ్యాలి అనే డిమాండ్ ఎప్పట్నుంచో ఫ్యాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా మళ్ళీ తమ కోరికని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ కోరికని బాలయ్య, ఎన్టీఆర్ తీరుస్తారేమో చూడాలి. బాలయ్య ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. 5 . IBOMMA మళ్లీ వచ్చేసింది! కొంతకాలంగా నిలిచిపోయినట్లు కనిపించిన IBOMMA వెబ్సైట్ తాజాగా మళ్లీ ఆన్లైన్లో కనిపించడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సైట్ ని ఆపరేట్ చేస్తున్నాడనే ఆరోపణలతో రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయగా.. సైట్ కూడా క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాలతో సైట్ యాక్టివ్ కావడం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రవి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న విషయం తెలిసిందే. 6 . మెగాస్టార్ చిరంజీవి జెన్ జీ లుక్ వైరల్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో స్లిమ్‌గా, స్టైలిష్‌గా జెన్ జీ లుక్ లో యువ హీరోలకి సైతం పోటీ ఇచ్చేలా ఉన్నారు. దీంతో సదరు స్టిల్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గత కొంతకాలంగా చిరు కఠినమైన డైట్ క్రమశిక్షణతో కూడిన వర్కవుట్స్ చేస్తున్నారు. అందుకే అంత ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని సినీ వర్గాల టాక్. 7 . క్షమాపణలు చెప్తున్న అలీ హిందువులని అవమానించే రీతిలో ఉన్న సోప్ యాడ్ చేసి ప్రముఖ నటుడు అలీ అపఖ్యాతికి గురైన విషయం తెలిసిందే. హిందువులు సోషల్ మీడియా వేదికగా అలీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గతంలో తాను నటించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలోని ఒక పాపులర్ కామెడీ సీన్‌ని స్ఫూర్తిగా తీసుకుని ముంబైకి చెందిన కంపెనీ ఈ యాడ్ రూపొందించింది దాంతో కేవలం వినోదం కోసమే ఆ యాడ్ చేశాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాడు. 8 . పూజాహెగ్డే కి అండగా అల్లు అర్జున్! పూజాహెగ్డే ఇటీవల కెరీర్ పరంగా కొంచం డల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో తనకి అవకాశం ఇవ్వబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అట్లీ మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. పూజా, అల్లు అర్జున్ కాంబోలో ఇప్పటికే డి జె జగన్నాధం, అల వైకుంఠ పురం వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. 9 . వారణాసిలో వారణాసి’ షూటింగ్? మహేశ్‌బాబు రాజమౌళి ల ‘వారణాసి’షూటింగ్ ఇప్పుడు అసలు లెవల్‌కి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీన్‌ని వారణాసిలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదట ఈ సన్నివేశాన్ని హైదరాబాద్‌లో షూట్ చేయాలని అనుకున్నారు. కానీ 150 ట్యాంకర్ల నీటి సరఫరాకి జలమండలి అనుమతి ఇవ్వకపోవడంతో వారణాసికి షిఫ్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి . 10 . నట్టి కుమార్ రాజీనామా ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు తాను పంపిన రాజీనామా లేఖలో 'ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పారదర్శకత లోపించింది. కొందరు సభ్యుల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిన్న నిర్మాతలకి అన్యాయం జరుగుతుంది. థియేటర్ల కేటాయింపు, వర్చువల్ ప్రింట్ ఫీజు వంటి విషయాల్లో కౌన్సిల్ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది. కేవలం కొందరి ప్రయోజనాల కోసమే కౌన్సిల్ కార్యకలాపాలు సాగుతున్నాయి. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
May 13, 2026 3:22PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






