English | Telugu

విరాటపర్వం దర్శకుడి భారీ మల్టీస్టారర్!

వేణు ఊడుగుల దర్శకత్వంలో మల్టీస్టారర్
ఒక సీనియర్ హీరో, ఒక యంగ్ హీరో

నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు పొందారు వేణు ఊడుగుల. అయితే విరాటపర్వం విడుదలై మూడేళ్ళయినా ఇంతవరకు ఆయన దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కలేదు. వేణు మూడో సినిమా హీరో ఇతనేనంటూ.. నాగచైతన్య, వెంకటేష్, సూర్య, ధనుష్ వంటి పేర్లు వినిపించాయి. కానీ, ఆ పేర్లు ప్రచారానికే పరిమితమయ్యాయి. అలాంటిది ఇప్పుడు వేణు ఊడుగుల ఏకంగా ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారన్న వార్త ఆసక్తికరంగా మారింది.

Also Read:రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ

వేణు ఊడుగుల తన తదుపరి సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నారు. నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం తరహాలోనే ఎమోషన్స్ తో కూడిన ఒక బ్యూటిఫుల్ కథను సిద్ధం చేశారట. ఈ కథ ప్రకారం ఒక సీనియర్ హీరో, ఒక యంగ్ హీరో కావాల్సి ఉందట. మొదట తెలుగు సీనియర్ హీరోలను ప్రయత్నించిన వేణు.. ఫైనల్ గా మలయాళ స్టార్ మోహన్ లాల్ కి ఓటేసినట్లు తెలుస్తోంది. ఇక యంగ్ హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలో అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది అంటున్నారు.

Also Read:రాజు వెడ్స్ రాంబాయికి షాకింగ్ కలెక్షన్స్

కాగా, వేణు ఊడుగుల 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమాతో నిర్మాతగా మారడం విశేషం. వాస్తవ సంఘటనల ఆధారంగా సాయిలు కంపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఈ వారం థియేటర్లలో అడుగుపెట్టి, మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది.