Home

»

Gossips

రామ్, బోయ‌పాటి చిత్రానికి ముహూర్తం ఫిక్స్!?

May 24, 2022

`అఖండ‌`తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో తీయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్క‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీ‌నివాస చిట్టూరి నిర్మించ‌నున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప‌రిణీతి చోప్రా ఓ హీరోయిన్ గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అలాగే, యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందించ‌నున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ఇదిలా ఉంటే, రామ్ - బోయ‌పాటి మూవీకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంద‌ట‌. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి.. 2023 వేస‌విలో సినిమాని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.

కాగా, రామ్ ప్ర‌స్తుతం `ద వారియ‌ర్`లో న‌టిస్తున్నాడు. కాప్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ బైలింగ్వ‌ల్ మూవీలో రామ్ కి జంట‌గా కృతి శెట్టి న‌టిస్తుండ‌గా ఆది పినిశెట్టి ప్ర‌తినాయ‌కుడిగా ద‌ర్శ‌న‌మివ్వ‌న్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రం.. జూలై 14న రిలీజ్ కానుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com