English | Telugu

మోక్షజ్ఞ మూవీ లాంచ్ కి ఎన్టీఆర్!

నందమూరి అభిమానుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినీ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న ఆయన డెబ్యూ మూవీ లాంచ్ జరగనుంది.

మోక్షజ్ఞ మొదటి చిత్రానికి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాత అని సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మైథలాజికల్ టచ్ తో రూపొందనున్న ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో మెరుస్తారట. అధికారిక ప్రకటన కూడా రాకుండానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ లాంచ్ సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఎంతో వైభవంగా జరగనుందని తెలుస్తోంది.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంచ్ కి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా హాజరు కాబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్, అలాగే నందమూరి కుటుంబసభ్యులందరూ హాజరు కాబోతున్నారట. అంతేకాకుండా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్స్ మొదలుకొని.. ఈ తరం స్టార్స్ వరకు ఎందరో ఈ లాంచ్ ఈవెంట్ లో సందడి చేసే అవకాశముంది అంటున్నారు. అయితే ఎంతమంది ఉన్నా.. ఎన్టీఆర్ హాజరైతే ఆయనే ఈ ఈవెంట్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశముంది. ఎందుకంటే కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ లో ఎన్టీఆర్ మిస్ అవుతున్నాడు. ఇప్పుడు మోక్షజ్ఞ మూవీ లాంచ్ తో ఆ లోటు తీరితే.. నందమూరి ఫ్యాన్స్ ఎంతో సంబరపడతారు.