English | Telugu
మహేష్ 'వారణాసి'లో ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్!
Updated : Nov 25, 2025
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
బాల నటుడిగా భార్గవ్ రామ్
వారణాసితో సినీ రంగ ప్రవేశం?
మహేష్ చిన్నప్పటి పాత్రలో భార్గవ్?
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) చిన్న కుమారుడు భార్గవ్ రామ్(Bhargav Ram)కి సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో లేదా సినిమా ఈవెంట్స్ లో భార్గవ్ చేసే క్యూట్ అల్లరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. భార్గవ్ బాలనటుడిగా సినిమాలు చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అయితే వారి కోరిక త్వరలోనే నెరవేరేలా ఉంది.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో 'వారణాసి'(Varanasi) అనే భారీ బడ్జెట్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని రూపొందుతోన్న ఈ సినిమాలో.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక మహేష్ చిన్నప్పటి పాత్ర కోసం ఎన్టీఆర్ తనయుడు భార్గవ్ రామ్ ని రంగంలోకి దింపుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Also Read: పాపం రకుల్.. వాట్సాప్ దెబ్బకు కొత్త తలనొప్పి!
అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరితోనూ ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది. రాజమౌళి కెరీర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'స్టూడెంట్ నెం.1' సినిమాతోనే స్టార్ట్ అయింది. అప్పటినుండి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇక మహేష్, ఎన్టీఆర్ కూడా బ్రదర్స్ లా ఉంటారు. అందుకే ఇప్పుడు రాజమౌళి-మహేష్ కాంబోలో వస్తున్న మూవీలో ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్ నటిస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
రాజమౌళి, మహేష్ లతో ఎన్టీఆర్ కి ఉన్న అనుబంధం నేపథ్యంలో.. ఇప్పటికే 'వారణాసి' సినిమా పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాజిటివ్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు భార్గవ్ రామ్ కూడా భాగమైతే.. 'వారణాసి' ఫిల్మ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత ఓన్ చేసుకుంటారు అనడంలో సందేహం లేదు.
మరి 'వారణాసి'లో భార్గవ్ రామ్ నటిస్తున్నాడన్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే.. కొంతకాలం వెయిట్ చేయాలి. ఒకవేళ నిజమైతే.. దీంతో పాటు, బాలనటుడిగా భార్గవ్ మరిన్ని సినిమాలు చేస్తాడేమో చూడాలి.