English | Telugu
రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్!
Updated : Jan 4, 2026
'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్(Ram Charan) కీలక పాత్ర పోషించిన 'ఆచార్య', హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' నిరాశపరిచాయి. దీంతో ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న 'పెద్ది'(Peddi)పై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న పెద్ది మూవీని 2026, మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడనుందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ, మూవీ టీమ్ ప్రమోషన్స్ లో జోరు చూపించడంతో.. ఆ వార్తల్లో నిజంలేదని అభిప్రాయానికి అభిమానులు వచ్చారు.
అయితే ఇప్పుడు మరోసారి వాయిదా వార్తలు గుప్పుమన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉందని, అందుకే మార్చిలో విడుదల సాధ్యంకాదని అంటున్నారు. అందుకే రీసెంట్ గా న్యూ ఇయర్ కి కూడా పెద్ది నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదని చెబుతున్నారు. అంతేకాదు, ఈ సినిమా ఏకంగా డిసెంబర్ కి వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది. అసలు పోస్ట్ పోన్ న్యూసే షాక్ అంటే.. అది ఏకంగా డిసెంబర్ కావడం మరింత షాక్ అని చెప్పవచ్చు.