English | Telugu

బ్రేకింగ్‌ న్యూస్‌.. వారణాసికి సంబంధించి 650 కోట్ల డీల్‌ను రిజెక్ట్‌ చేసిన రాజమౌళి

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'వారణాసి'. ఈ చిత్రాన్ని గ్లోబల్‌ లెవల్‌లో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2027 ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చగా మారింది.

ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ దృష్ట్యా థియేట్రికల్‌గానే కాకుండా, డిజిటల్‌గా స్టార్‌ హీరోల సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంది. అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ కీలకంగా మారాయి. ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ 650 కోట్ల రూపాయల ఆఫర్‌ ఇచ్చారని తెలుస్తోంది. అయితే మేకర్స్‌ దాన్ని రిజెక్ట్‌ చేశారని ఇండిస్టీలో టాక్‌ వినిపిస్తోంది. ఇంత భారీ డీల్‌ను రిజెక్ట్‌ చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాజమౌళి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ డీల్‌ను కాదనుకున్నారని సమాచారం.

బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల తర్వాత రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఫాలోయింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్‌బాబు సినిమా ఎనౌన్స్‌ చేయగానే సహజంగానే హయ్యస్ట్‌ బిజినెస్‌ జరుగుతుందనే అభిప్రాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా టైటిల్‌ విషయంలో వచ్చిన వివాదం కూడా చర్చనీయాంశంగా మారింది. మొదట్లో 'వారణాసి' అనే పేరు ఫిక్స్‌ చేసినప్పటికీ ఆ తర్వాత ఎస్‌.ఎస్‌.రాజమౌళి వారణాసిగా మార్చారు.

సాధారణంగా టైటిల్స్‌ ముందు హీరోల పేర్లు ఉండడం చూస్తుంటాం. కానీ, ఈ సినిమా టైటిల్‌కి ముందు డైరెక్టర్‌ పేరు ఉండడంతో మహేష్‌ అభిమానులు కూడా దీనిపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే టైటిల్‌కి ముందు అతని పేరు పెట్టారనే టాక్‌ వినిపిస్తోంది. ఓ పక్క టైటిల్‌ గురించి ఈ చర్చ జరుగుతుండగానే మరో పక్క ఓటీటీకి సంబంధించి వచ్చిన భారీ డీల్‌ను ఎందుకు రిజెక్ట్‌ చేశారనే అంశంపై కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటీటీ సంస్థల్లో అగ్రగామి అయిన నెట్‌ఫ్లిక్స్‌ ఇచ్చిన భారీ ఆఫర్‌ను 'వారణాసి' మేకర్స్‌గానీ, రాజమౌళిగానీ రిజెక్ట్‌ చెయ్యడం గురించి ఇండియన్‌ సినిమా మార్కెట్‌లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు ఇండియన్‌ సినిమాలకు సంబంధించి హయ్యస్ట్‌ డీల్‌ ఇదేనని చెబుతున్నారు. ఈ సినిమాకి ఉన్న హైప్‌ దృష్ట్యా ఇంకా ఎక్కువ మొత్తం కోసం ఎదురుచూస్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో అత్యధికంగా 'కల్కి 2898ఎడి' చిత్రానికి 375 కోట్లు, 'కెజిఎఫ్‌2'కి 320 కోట్లు, 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి రూ.300 కోట్లు ఓటీటీ ద్వారా లభించాయి. ఇప్పుడు 'వారణాసి' చిత్రానికి దాదాపు రెట్టింపు ఆఫర్‌ వచ్చింది. అయినా మేకర్స్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించడం ఇండిస్టీలో హాట్‌ టాపిక్‌ మారింది.