Home

»

Bollywood News

హిందీ 'ప‌రుగు' సీక్వెల్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

Mar 02, 2021

 

స‌ర్‌ప్రైజ్‌! టైగ‌ర్ ష్రాఫ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం న‌దియ‌డ్‌వాలా గ్రాండ్‌స‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ 'హీరోపంతి 2' రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసి, ఫ్యాన్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో, ఆనందంలో ముంచేసింది. టైగ‌ర్ ష్రాఫ్ నుంచి రానున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'హీరోపంతి 2' ఒక‌టి. 2014లో 'హీరోపంతి' మూవీ ద్వారానే హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు టైగ‌ర్‌. అది తెలుగులో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ష‌న్‌లో అల్లు అర్జున్ న‌టించిన హిట్ మూవీ 'ప‌రుగు'కు రీమేక్‌. తెలుగులో దానికి సీక్వెల్ ఆలోచ‌న చెయ్య‌లేదు కానీ హిందీలో మాత్రం సీక్వెల్ వ‌స్తుండ‌టం విశేషం. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో రెండో భాగాన్ని టైగ‌ర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప్ర‌క‌టించ‌డం ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌గా మారింది.

పోస్ట‌ర్‌లో సూట్ వేసుకొని, కారు రూఫ్‌టాప్‌పై నిల్చొని, రెండు చేతుల్లో గ‌న్స్‌తో పాయింటింగ్ చేస్తూ హీరోయిక్‌గా ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో కనిపిస్తున్నాడు టైగ‌ర్‌. 2021 డిసెంబ‌ర్ 3న హీరోపంతి 2 రిలీజ్ కానున్న‌ది. ఆ పోస్ట‌ర్‌ను న‌దియ‌డ్‌వాలా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, ”Dropping this Bomb Poster on our @tigerjackieshroff ’s birthday! We couldn’t be more Excited #SajidNadiadwala’s #Heropanti2 releases in cinemas on 3rd December, 2021 @khan_ahmedasas @wardakhannadiadwala” అని రాసుకొచ్చింది.

అదే పోస్ట‌ర్‌ను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన టైగ‌ర్‌, “My first love is back️ action, thrill, like never before! Lets celebrate this one together on the 3rd of december in cinemas #SajidNadiadwala’s #Heropanti2 @khan_ahmedasas @wardakhannadiadwala @nadiadwalagrandson @rajeev_chudasama” అని ట్వీట్ చేశాడు.

అహ్మ‌ద్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్న‌ ఈ మూవీలో టైగ‌ర్ జోడీగా తారా సుతారియా న‌టిస్తోంది. పోస్ట‌ర్ ప్ర‌కారం చూసుకున్నా, టైగ‌ర్ చేసిన ట్వీట్ చూసుకున్నా ఈ మూవీలో యాక్ష‌న్ వేరే లెవ‌ల్లో ఉంటుంద‌ని అర్థ‌మైపోతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com