English | Telugu
మార్చి 14న బుమ్రా పెళ్లి.. వధువు ఈమేనా?
Updated : Mar 9, 2021
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో పెళ్లాడబోతున్నాడనేది కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్. మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్తో అతని పెళ్లి జరగబోతోందని కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని అనుపమ తల్లి సునీత ఖండించారు. అవన్నీ ఒట్టి వదంతులుగా తేల్చేశారు. మరైతే ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన బుమ్రా ఎవర్ని పెళ్లి చేసుకుంటున్నాడనే విషయం చర్చనీయాంశమైంది.
లేటెస్ట్గా వధువు పేరు బయటకు వచ్చింది. మాజీ మోడల్, స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ మెడలో బుమ్రా మూడు ముళ్లు వేయనున్నట్లుగా ప్రస్తుతం ఆన్లైన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మార్చి 14న గోవాలో వారి పెళ్లి జరుగుతోందని కూడా చెప్పుకుంటున్నారు. బుమ్రా, సంజన ఇంతదాకా కలిసి ఎప్పుడూ బహిరంగంగా కనిపించలేదు. అయితే ఆ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఓ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది.. బీసీసీఐ యాన్యువల్ అవార్డ్స్ ప్రోగ్రామ్‌లో బుమ్రాను సంజన ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటో.
స్టార్ స్పోర్ట్స్‌లో స్పోర్ట్స్ యాంకర్‌గా, ప్రెజెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించడానికి ముందు సంజన 2014 మిస్ ఇండియా ఫైనలిస్ట్. ఆ రకంగా బుమ్రాతో అయిన పరిచయం, ప్రణయంగా మారిందంటూ తాజాగా కథనాలు వినిపిస్తున్నాయి. జీ హిందుస్తాన్ రిపోర్ట్ ప్రకారం ఈ నెల 14న గోవాలో ఆ ఇద్దరూ దంపతులు కాబోతున్నారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం అతి తక్కువ మంది అతిథులు మాత్రమే ఈ వేడుకకు రానున్నారంట. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమ్‌తో టీ ట్వంటీ ఆడనున్న భారత క్రికెట్ జట్టు సభ్యులెవరూ ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం లేదంటున్నారు. అయితే బుమ్రా పెళ్లి గురించి అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.