English | Telugu

శ్రీముఖికి ఆరు నెలల్లో పెళ్లి చేస్తానన్న గంగవ్వ...

ఉగాది సందర్భంగా ఈ వారం ఎన్నో ఈవెంట్స్ బుల్లితెర మీద ప్రసారమయ్యాయి. అందులో స్టార్ మా ప్రసారమైన మా ఇంటి పండగ షో ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఇందులో బుల్లితెర మీద నటించే నటీనటుల కుటుంబాలు వచ్చాయి. అలాగే మై విలేజ్ షో టీమ్ మొత్తం కూడా ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వ ఇటు వెబ్ సిరీస్ లో, మూవీస్ లో నటిస్తోంది. రీసెంట్ గా సేవ్ ది టైగర్స్ లో, గేమ్ చెంజర్ మూవీలో నటించింది. ఇక సేవ్ ది టైగర్స్ లో గంగవ్వ కోడలిగా జోర్దార్ సుజాత నటించింది. ఈ షోకి ఆమె ఫ్యామిలీ కూడా వచ్చింది. ఐతే తనకు సుజాత పెళ్లి కూడా గంగవ్వ ఊరు వెళ్లాకే జరిగిందని చెప్పాడు రాకేష్.

నోరు జారేసిన అభినవ్ గోమటం...అనసూయ టార్చర్ పెడుతుంది

ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా సరే రాజేంద్ర ప్రసాద్, కోటా, బ్రహ్మానందం, బాబుమోహన్ మూవీస్ పెట్టుకుని ఫుల్ ఛిల్ అవుతూ ఉంటారు. ఇక ఆ జెనెరేషన్ వాళ్ళ టైం ఐపోయింది. ఇప్పటి  జెనెరేషన్ వాళ్ల కోసం  యంగ్ కమెడియన్స్ చాలా మంది వచ్చేసారు. వాళ్ళే ప్రియదర్శి, అభినవ్ గోమటం లాంటి వాళ్ళు. వీళ్ళను చూస్తే చాలు ఆటోమేటిక్ గా నవ్వొచ్చేస్తుంది. వీళ్ళు నటించిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. ఐతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న అభినవ్ గోమటంతో ఇంటర్వ్యూ చేసింది రీతూ చౌదరి. దావత్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి వచ్చాడు అభినవ్. ఐతే ఒకసారి విశ్వక్ సేన్ బర్త్ డేకి వాళ్ళ ఫ్రెండ్ ఒక కేక్ తెచ్చాడట. అది కాస్తా ఫీమేల్ షేప్ లో ఉండేసరికి  అది తినాలా వద్దా అంటూ భయపడ్డానని తడబడుతూ చెప్పాడు.

వంటలక్క పెళ్లి మలయాళం నటుడు జయసూర్యతో కావాల్సింది..కానీ

కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ వంటలక్క గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. వంటలక్క అసలు ప్రేమి విశ్వనాధ్. వంటలక్క ఏడిస్తే ఆడియన్స్ కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వంటలక్క నటించిన కార్తీక దీపం సీరియల్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఐతే వంటలక్క రియల్ లైఫ్ లో  మలయాళం నటుడు జయసూర్యకు చుట్టం అన్న విషయం తెలుసా. ఐతే ఈ విషయాన్ని వంటలక్క ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం ఎపిసోడ్ లో చెప్పింది. ఈ షోలో "జింగ్ జింగ్ అమేజింగ్" అనే సెగ్మెంట్ లో హుడి అనే మెంటలిస్ట్ వచ్చి కాసేపు గేమ్స్ ఆడించాడు. ఐతే అందులో వంటలక్క క్రష్ ఎవరో మనసులో తలుచుకోమని చెప్పాడు. చివరికి తన మ్యాజిక్ ద్వారా వంటలక్క క్రష్ పేరు జయసూర్య అని రివీల్ చేసాడు.