English | Telugu

19 ఏళ్ళ తర్వాత నిన్న రిలీజైన ఉపేంద్ర మూవీ.. పునీత్ రాజ్ కుమార్ ఉన్నాడు

Publish Date:Jan 31, 2026

    -ఉపేంద్ర మూవీ ఎందుకు లేట్ అయ్యింది! -మూవీలో ఎవెరెవరు ఉన్నారు -ప్రేక్షకాదరణ పొందుతుందా!   చిత్రపరిశ్రమలో కొన్నిసార్లు జరిగే విచిత్రాలు చూస్తుంటే ట్విస్ట్ లతో కూడిన చిత్రాలు ఇచ్చే థ్రిల్ కంటే ఎక్కువ థ్రిల్ ని ఇస్తుంటాయి. రీసెంట్ గా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సినిమా విషయంలో ఇదే జరిగింది. పంతొమ్మిది సంవత్సరాల తరవాత ఉపేంద్ర సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టగా, ఉపేంద్ర(Upendra)కి రిలీజ్ విషయం కూడా తెలియదు. పైగా మూవీలో పదిహేను మంది స్టార్స్ కూడా ఉన్నారు. ఏంటి ఇప్పుడు ఇదంతా నమ్మాలా అని అనుకుంటున్నారా! అయితే పూర్తి డీటెయిల్స్ చూసి మీ నమ్మకం తప్పు కాదని మీరే తెలుసుకోండి. రక్త కాశ్మీర. ఉపేంద్ర, స్టార్ హీరోయిన్ రమ్య జంటగా 2007 లో షూటింగ్ ని ప్రారంభించుకుంది. కానీ 19 సంవత్సరాల తర్వాత నిన్నకన్నడ నాట థియేటర్స్ లో ప్రత్యక్ష మయ్యింది. ఇన్ని రోజులు ఎందుకు రిలీజ్ కాలేదనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. పంతొమ్మిది సంవత్సరాల తర్వాత థియేటర్స్ లో అడుగుపెట్టి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. అయితే రిలీజ్ విషయం ఉపేంద్ర కి తెలియదనే టాక్ కన్నడ వర్గాల్లో వినపడుతుంది. ఆ మాటలకి బలాన్ని చేకూర్చేలా రిలీజ్ పై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసింది లేదు. సైలెంట్ గానే స్క్రీన్ పైకి వచ్చేసింది. Also read:  నిన్ను ఆ బట్టల్లో చూడాలని ఉందన్నాడు..ఇతనేనా అతను   ఇక రక్త కాశ్మీర కి ఉన్నస్పెషల్ ఏంటంటే ఒక సాంగ్  లో పునీత్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, దర్శన్, యష్, శివరాజ్ కుమార్ ఇలా  15 మంది హీరోలు దాకా క్యామియో ఇచ్చారు. సదరు సాంగ్  18 నిమిషాల పాటు ఉండటం విశేషం.కథ గురించి చెప్పుకోవాలంటే  స్టంట్ ట్రైనర్  అనాథ పిల్లల కోసం ఒక స్టంట్ ట్రైనింగ్ స్కూల్ నడుపుతుంటాడు. ఆ అనాథ పిల్లలు టెర్రరిస్టుల బాంబు పేలుడు ప్లాన్ గురించి తెలుసుకుంటారు.   దాంతో టెర్రరిస్టులు పిల్లలను అపహరించి కాశ్మీర్ కి  తీసుకెళ్తారు. ట్రైనర్, తన ప్రేయసితో కలిసి కాశ్మీర్ వెళ్లి పిల్లలని ఎలా కాపాడారనేదే చిత్ర కథ.  ఏం డి ఏం ప్రొడక్షన్స్ నిర్మించగా రాజేంద్ర సింగ్ బాబు(Rajendra Singh Babu)దర్శకుడు. కంప్లీట్ అడ్వెంచర్ డ్రామా తెరకెక్కింది.నిడివి 133 నిమిషాలు మాత్రమే. మరి ప్రేక్షకాదరణని ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి.        

Rajamouli proves his genius with Varanasi date announcement

Publish Date:Jan 30, 2026

SS Rajamouli, once again proved that he is a marketing and tactical genius. He indirectly hinted at Varanasi release date, 7th April 2027, with two posters in Varanasi city at random. Now, on 30th January, he made it official with a creative poster, confirming that it is not a gossip but their brilliant strategy to let world know.  As Varanasi city plays major role in the story as the cog that runs the wheel forward, putting up random posters as proved to be a genius strategy to grab world's attention. With news spreading like wildfire, he needed to just tweet today confirming and entire social media is discussing about the film.    Currently, the movie team is shooting non-stop in Hyderabad with Superstar Mahesh Babu and Priyanka Chopra Jonas. The shoot will continue till February first week or second week. Later, they would move to foreign location for next schedule and the pace of shoot has picked up drastically from last two months.  Antarctica schedule is in planning and the permissions for the same are being discussed upon to take the necessary precautions and complete shoot in perfect time. Mahesh Babu and Rajamouli are said to be in so sync that things are moving quicker than regular Rajamouli film. KL Narayana and SS Karthikeya are producing the film. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Gandhi Talks Movie Review

Publish Date:Jan 30, 2026

జాతీయ అవార్డును తిరస్కరించిన వేటూరి సుందరరామ్మూర్తి.. ఎందుకంటే?

Publish Date:Jan 29, 2026

(జనవరి 29 వేటూరి సుందరరామ్మూర్తి జయంతి సందర్భంగా..) మన సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. పాతతరం నుంచి ఇప్పటివరకు ఎందరో రచయితలు అందమైన పాటల్ని అందించారు. వారు అందించిన పాటలు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఒక దశలో శ్రీశ్రీ, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర వంటి రచయితలు తమదైన శైలిలో పాటలు రాస్తూ వున్న సమయంలో ఒక మెరుపులా ఇండస్ట్రీకి వచ్చారు వేటూరి సుందరరామ్మూర్తి. దాదాపు 40 సంవత్సరాలపాలు తెలుగు పాటను పరవళ్లు తొక్కించిన వేటూరి 5,000కి పైగా పాటలు రాశారు. ఆ సమయంలో ఉన్న అందరు రచయితల శైలి తన పాటల్లో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు వేటూరి. చాలా ఆలస్యంగా పరిశ్రమకు వచ్చిన వేటూరి.. చాలా తక్కువ సమయంలోనే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అగ్రరచయిత అనిపించుకున్నారు. రచయితగా మారడానికి ముందు ఆయన ఎలాంటి సాహిత్యాన్ని చదవలేదు. కేవలం రేడియోలో వస్తున్న పాటల్ని వింటూ పాటల రచనపై ఆసక్తిని పెంచుకున్నారు.  1936 జనవరి 29న కష్ణాజిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో వేటూరి చంద్రశేఖరశాస్త్రి, కమలాంబ దంపతులకు జన్మించారు వేటూరి సుందరరామ్మూర్తి. తండ్రి నేత్ర వైద్యులుగా ఉండేవారు. తల్లి కమలాంబకు సాహిత్యంలోనూ, సంగీతంలోనూ ప్రవేశం ఉంది. వత్తి రీత్యా వీరి కుటుంబం విజయవాడ వచ్చింది. అక్కడ 5వ తరగతి వరకు చదువుకున్నారు వేటూరి. ఆ తర్వాత జగ్గయ్యపేటలో 9వ తరగతి వరకు, గుంటూరు జిల్లాలోని కొల్లూరులో ఎస్ ఎస్ ఎల్ సి వరకు చదువుకున్నారు. మద్రాస్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి బి.ఎ. ఎకనమిక్స్ చేశారు. అటు పిమ్మట లా చేసేందుకు మద్రాస్ వెళ్లారు. చదువుతున్న రోజుల్లోనే రచనల పట్ల ఆసక్తి బాగా పెరిగింది. లా రెండో సంవత్సరంలో ఉండగానే జర్నలిజంలో చేరితే బాగుంటుందని సన్నిహితులు సలహా ఇవ్వడంతో ఆంధ్రప్రభ పత్రికలో విలేకరిగా చేరారు. ఆ తర్వాత ఆంధ్ర సచిత్ర వార పత్రికలో శీర్షికలు రాసేందుకు చేరారు. 1956 నుంచి 16 ఏళ్ళపాటు జర్నలిస్ట్‌గా పనిచేశారు.  ఆంధప్రత్రికలో పనిచేస్తున్న సమయంలోనే వేటూరి రచనలు నటరత్న ఎన్.టి.రామారావును బాగా ఆకట్టుకున్నాయి. సినిమాల్లో పాటలు రాస్తే బాగా రాణిస్తారని ఆనాడే ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ సీత కథ’ చిత్రంలోని ‘భారతనారి చరితము’ అనే హరికథతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. 1974లో ఈ చిత్రం విడుదలైంది. అయితే మూడేళ్లు గడిచినా వేటూరికి మరో అవకాశం రాలేదు. ఎన్టీఆర్ దృష్టిలో వేటూరి ఉండడంతో కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఆయన చేస్తున్న ‘అడవిరాముడు’ చిత్రంలోని అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి చరిత్ర సష్టించింది. మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్ అవ్వడంతో రచయితగా వేటూరి పాపులర్ అయిపోయారు. ఆ క్రమంలోనే పంతులమ్మ, సిరిసిరిమువ్వ చిత్రాల్లోని అన్ని పాటలు రాశారు వేటూరి. సిరిసిరిమువ్వ చిత్రానికి జంధ్యాలతో కలిసి మాటలు కూడా రాశారు.  1979లో పాటల రచయితగా వేటూరి జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన శంకరాభరణం చిత్రంలోని అన్ని పాటలు రాసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం.. ఇలా ఎన్నో సినిమాల్లో తరాల తరబడి గుర్తుపెట్టుకునే పాటలు రాశారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు వేటూరి. ఇది కాక ఆయనకు ఎన్నో నంది అవార్డులు, ఇతర పురస్కారాలు లభించాయి.  ఒక తరహా పాటలు కాకుండా ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగల ప్రతిభ కలిగిన వేటూరి రచించిన కొన్ని గీతాల గురించి చెప్పాలంటే.. కృషి వుంటే మనుషులు రుషులౌతారు, మానసవీణా మధుగీతం, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, ఝుమ్మంది నాదం.. సై అంది పాదం, కొమ్మ కొమ్మకో సన్నాయి.., శంకరాభరణం చిత్రంలోని అన్ని పాటలు, రాగాల పల్లకిలో కోయిలమ్మా, ఆకాశ దేశాన.. ఆషాఢ మాసానా.., కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, వెన్నెల్లో గోదారి అందం, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, గీతాంజలి చిత్రంలోని అన్ని పాటలు, జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అన్ని పాటలు, పావురానికి పంజరానికి, ఎన్నెన్నో అందాలు, ఓ ప్రేమా నా ప్రేమా, జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే, ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకు, సఖియా చెలియా.. ఇలా వేటూరి కలం నుండి జాలువారిన మధురగీతాల్లో ఇవి మచ్చు తునకలు మాత్రమే. తెలుగు సినిమాకి వేటూరి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్, వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో 2011లో వచ్చిన బద్రినాథ్ చిత్రంలో ఓంకారేశ్వరి.. వేటూరి రాసిన చివరి పాట. ఈ సినిమా విడుదల కావడానికి సంవత్సరం ముందు 2010 మే 22న 75 ఏళ్ళ వయసులో గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు వేటూరి సుందరరామ్మూర్తి.

'యానిమల్ పార్క్' నుంచి బిగ్ అప్డేట్.. మరి 'స్పిరిట్' పరిస్థితి ఏంటి?

Publish Date:Jan 27, 2026

  రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ ఫిల్మ్ 'యానిమల్'(Animal). రూ.200 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. 2023 డిసెంబర్ లో విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం సాధించింది. దీంతో 'యానిమల్'కి సీక్వెల్ గా రానున్న 'యానిమల్ పార్క్' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు రణ్‌బీర్‌ కపూర్‌. (Animal Park)   'యానిమల్' వచ్చి రెండేళ్లు దాటినా ఇంతవరకు 'యానిమల్ పార్క్' పట్టాలెక్కలేదు. దానికి కారణం రణ్‌బీర్‌, సందీప్ రెడ్డి ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటమే. రణ్‌బీర్‌ 'లవ్ అండ్ వార్', 'రామాయణ' సినిమాలు చేస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్(Prabhas)తో 'స్పిరిట్'(Spirit) చేస్తున్నాడు.    'స్పిరిట్' పూర్తయ్యాక, ఆరు నెలల విరామం తర్వాత 'యానిమల్ పార్క్' షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని తాజాగా రణ్‌బీర్‌ స్పష్టం చేశాడు. "ప్రస్తుతం సందీప్ మరో సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక 2027లో మా సినిమా మొదలవుతుంది. యానిమల్ ను మూడు భాగాలుగా తెరకెక్కించాలి అనేది దర్శకుడి ఆలోచన. రెండో భాగంగా 'యానిమల్ పార్క్' రానుంది. హీరోగా, విలన్ గా రెండు పాత్రలూ నేనే పోషిస్తుండటంతో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిగా ఉన్నాను." అని రణ్‌బీర్‌ చెప్పుకొచ్చాడు.  

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

Publish Date:Jan 31, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది. కావ్య వెళ్ళిపోయాక అక్కడే దాక్కొని ఉన్న రుద్రాణి బయటకు వస్తుంది. అదేంటి మినిస్టర్ అని మర్చిపోయి మాట్లాడుతుంది అని రుద్రాణితో మినిస్టర్ అంటాడు. అది అలాగే మాట్లాడుతుందని రుద్రాణి అంటుంది. మరొకవైపు కావ్య కోసం ఇంట్లో అందరు వెయిట్ చేస్తుంటారు. కావ్య రాగానే ఎక్కడికి వెళ్లావని అడుగుతారు. మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఈ రోజే నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని పాపని తీసుకొని కావ్య లోపలికి వెళ్తుంది. ఇక కావ్యని బయటకు పంపించకపోవడమే మంచిది అని రేఖ అంటుంది. ఆ తర్వాత రేఖకి రుద్రాణి ఫోన్ చేసి.. నేను చెప్పినట్లు చేస్తున్నావా అని అడుగుతుంది. ఆ కావ్యకి పాప గురించి నిజం తెలిసిపోయిందని రుద్రాణి చెప్పగానే రేఖ షాక్ అవుతుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. రాజ్ కి కావ్య జరిగింది మొత్తం చెప్తుంది. అదంతా నేను నమ్మలేకపోతున్నా కావ్య.. అలా ఎలా జరుగుతుందని ఆశ్చర్యపోతాడు. మీరు నాతో నా బిడ్డ దగ్గరికి రండి అంతా అర్ధమవుతుందని కావ్య అనగానే రాజ్ సరే అంటాడు. తరువాయి భాగంలో రాజ్ ని తీసుకొని మినిస్టర్ ఇంటికి వెళ్తుంది కావ్య. మినిస్టర్, తులసి భోజనం చేస్తుంటే.. వాళ్లకి తెలియకుండా పాప దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అక్కినేని హీరోల మల్టీస్టారర్.. మరో 'మనం' అవుతుందా?

Publish Date:Jan 29, 2026

  అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్   ఈ తరంలో క్లాసిక్ మల్టీస్టారర్ అంటే మొదటగా గుర్తుకొచ్చే సినిమా 'మనం'. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన ఈ మూవీ.. 2014 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తండ్రీకొడుకులు నాగార్జున (Nagarjuna), నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు'(2022) కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు తెలుస్తోంది.   అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil Akkineni) కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దీనిని నిర్మించనుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు.    నాగ చైతన్య ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ'(Vrushakarma) సినిమా చేస్తున్నాడు. దీనిని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అఖిల్ విషయానికొస్తే 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో 'లెనిన్'(Lenin) మూవీ చేస్తున్నాడు. ఇది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల తర్వాత అక్కినేని బ్రదర్స్ మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశముంది.   Also Read: సినిమాలకు బ్రేక్ ఇస్తున్న రామ్ చరణ్!    

Buzz: Varanasi makers to lock Ugadi 2027 date

Publish Date:Jan 29, 2026

Varanasi starring Superstar Mahesh Babu, Priyanka Chopra, Prithviraj Sukumaran has created a huge buzz around the world with the title announcement teaser. Now, the makers have silently locked the April 7th 2027 Release date. As per some unconfirmed sources few poster hoardings with the date have been placed in Varanasi city.  As per sources close to team, the movie shooting is going on at brisk pace without any breaks. Last year, they have shot some action episodes and now, they are filming talkie portions. Director SS Rajamouli and Mahesh have been so in sync that they are completing the shots sooner shocking even the long time collaborators of director.   Sources also state that they have discussed about the release date and asked VFX experts to complete the work with that date in mind without any delays. Also, Antarctica portions are in discussion stage only and makers did not get any permission to shoot yet on the continent.  But they are considering going to the place and shoot. Ramayanam portions and connection between past and future will be very interesting and different from all Rajamouli touched previously, say sources. Well, Durga Arts and SS Karthikeya of Showing Business are producing the film on an unimaginable scale.  Ugadi date would be perfect looking at Ramayana connection in the film, say sources.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Om Shanti Shanti Shantihi

Publish Date:Dec 31, 1969

Nari Nari Naduma Murari

Publish Date:Dec 31, 1969

Anaganaga Oka Raju

Publish Date:Dec 31, 1969