ద్రోహం
.png)
"మన ప్రేమకి నువ్వింత ద్రోహం తలపెడ్తావని నేననుకోలేదు జ్యోతీ" బాధగా
అన్నాడు మోహన్.
"అదేంటి మోహన్ అలా అంటున్నావు?...నేను నిన్ను తప్ప వేరే మగాడిని కన్నెత్తయినా
చూడనే..." అంది జ్యోతి మరింత బాధగా.
"నేననేది అది కాదు! ఇప్పుడు ఇద్దరం హాయిగా ప్రేమించుకుంటున్నాం కదా...ఈ మధ్య
పెళ్లి ప్రసక్తి ఎందుకు తీసుకువస్తున్నావ్ అని?..." చికాకుగా అన్నాడు మోహన్.










