తెలుగంటే రాజసానికి చిరునామా - అభిలాష

తెలుగంటే రాజసానికి చిరునామా భగ భగ మండుతోంది గుండె మన మాతృ భాషను చులకన చేస్తే.... సల సల మరుగుతోంది రుధిర జ్వాల తెలుగుని తేలిక గా చూస్తే....

Jan 19, 2012

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

ప్రేమకీ ద్వేశానికీ మధ్య ఆ గోడ అతి చిన్నది 'అటు' దూకితే ప్రేమ! 'ఇటు'దూకితే ద్వేషం!!

Jan 19, 2012

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

చూపుల చురకలతో నా హృదయాన్ని చీల్చు ప్రేమనదినై ప్రవహిస్తాను నీ పాదపద్మాలను ప్రక్షాళిస్తాను!!

Jan 19, 2012

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకటరామిరెడ్డి

మానవ మహారణ్యం దారుల్లో మేము పధచారులం.... మనసుని పారేసుకుని హృదయంతో జీవితాన్ని వెదుకుతూ పోతాము!

Jan 18, 2012

నడక - శారదా అశోకవర్ధన్

ఎందాక ఈ నడక ఎక్కడికి నడక ఎప్పుడు మొదలెట్టానో తెలీదు ఎంతవరకు వెళ్లాలో తెలీదు ఊహ తెలిసిన నాటినుండి నడుస్తూనే వున్నా.... ఎండలో వానలో గాలిలో తేమలో ఎడతెరిపి లేకుండా నడుస్తూనే వున్నా.....

Jan 16, 2012

మళ్ళీ పసి పాపనై - శారదా అశోకవర్ధన్

నా పాదం మోపగానే ఈనేల నన్ను గుండెలకి హత్తుకుంది అమృతంలా ఆప్యాయతని పంచుతూ! స్వాగతం పలికింది ఎన్నో సంవత్సరాల తరువాత పుట్టింది కొస్తూన్న ఆడపడుచును ఆర్ర్ధంగా ఆదరించినట్టు!

Jan 16, 2012

కలంచేతికర్రగా! - శారదా అశోకవర్ధన్

హలంపట్టి పొలం దున్నే ఇంటపుట్టి కలం పట్టి సాహితీ క్షేత్రాన్ని దున్నాను నీ కలం బలం వన్నెతెచ్చింది నీవు పుట్టినింటికి వాసిరెడ్డి పేరుకే సాహితీ మెరుగులు దిద్దింది వాసి తప్ప రాశి కోసం పరుగెత్తలేదు

Jan 16, 2012

రీసర్చ్ లాబ్ - శారదా అశోకవర్ధన్

కొందరిని చూస్తే నమస్కరించాలనిపిస్తుంది కొందరిని చూస్తే తిరస్కరించాలనిపిస్తుంది కళ్లు చెప్తాయి పరికించి చూసి ఎవరు హితులో ఎవరు కాదో మనసు చెబుతోంది గుండెలోతుల్లోకి తొంగిచూసి ఎవరు నెయ్యానికి తగదురో

Jan 16, 2012

గొంతు గుండెలోన- శారదా అశోకవర్ధన్

గొంతుగుండెలోకి దిగిపోతోంది గుడ్లప్పగించాను - మాటరాక గుండె గోతుల్లోని గాయాలలోకి జారిపోతోంది గొంతు! మూగనై మిగిలాను - పలుకలేక అరవాలనుకున్నాను అందరూ వినేలా ఎలుగెత్తి

Jan 16, 2012

సమాంతరరేఖలు - శారదా అశోకవర్ధన్

వయసుకి మనసులేదు వద్దన్నా వస్తుంది ఆగమన్నా ఆగదు కొంచెం కనికరం అది ఎరుగదు మనసుకు వయసులేదు కమ్మని కలలు కంటూనే వుంటుంది నడుం వంగినా బలం తగ్గినా ఊహల పల్లకీలో ఊరేగుతూనే వుంటుంది

Jan 16, 2012

మగువా! చెయ్యి తెగువ! - శారదా అశోకవర్ధన్

పైశాచిక పడగవిప్పి నాట్యం చేస్తోంది నాగరీకం పదం పాడుతూ తాళం వేస్తోంది పురుషాధిక్యం సమాజం మీసాలు తిప్పి ఎప్పుడూ ఆడదానిపై సవాలు చేస్తూనే వున్నది స్త్ర్రీని ఒక నలుసుగానే కాలరాసి పారేస్తున్నది ఎదురు తిరిగిన మగువను మగరాయుడు అంటూ

Jan 16, 2012

నాగదికి రెండు కిటికీలు - శారదా అశోకవర్ధన్

నా గదికి రెండు కిటికీలున్నాయి - నా కళ్లలాగే నా కళ్ళు రెండు ఎప్పుడూ తెరిచే వుంటాయి. ఒక్క నిద్రలో తప్ప ఈ ప్రపంచంలోని వింతలన్నీ చూస్తూనే వుంటాయి కోరికలు నింపుకుంటూ వుంటాయి కానీ నా గదికిటికీలు మాత్రం రెండూ ఒక్కసారే ఎప్పుడూ తెరుచుకోలేదు ఓ కిటికీ గుండా ఎన్నెన్నో దృశ్యలో!

Jan 16, 2012

నీబాట నువ్వే వేసుకో - శారదా అశోకవర్ధన్

నా చిట్టి తల్లీ! నా గారాలవల్లీ! పదేళ్లయినా నిండని నిన్ను బయటి ప్రపంచం దృష్టిలో పడకుండా సృష్టిలోని అందాలను తనివితీరా చూడనీయకుండా నీ బాల్యాన్ని ఉండచుట్టి పడేసి నిన్ను గాంధారిని చేసి కూర్చోబెట్టే

Jan 16, 2012

చెత్తకుండీ గుండె పగిలిన వేళ - శారదా అశోకవర్ధన్

టపటప మని మబ్బుల పేగులు తెంచుకుని గాలి తాకిడికి రాలిన నీటి చుక్కలని చూసి రాని నిద్దురకోసం అలసటతో అల్లాడే పావని జోకొడితే బజ్జుంటుందేమోనన్న అమ్మ ఆశలా పుడమితల్లి పులకరిస్తూ ఒళ్ళు విరుచుకుని కళ్ళు పెద్దవి చేసి చూసింది పసిపాప బోసినవ్వులాగే హాయిగా నవ్వుకుంది!

Jan 16, 2012

ఏమో! - శారదా అశోకవర్ధన్

మానవుడా! మానవత్వాన్ని గుండెనిండా నింపుకుని దైవత్వం పొందిన సాధువులా జీవనాన్ని సాగించే మహామహుడా! జీవనయానంలో అలుపెరుగని ప్రయాణికుడా!

Jan 16, 2012

ఇప్పుడే తెలిసింది - శారదా అశోకవర్ధన్

అబలవూ ఆడపిల్లవూ అంటూ అందరూ నిన్ను అలుసుగచూసేవాళ్ళే పుట్టగానే పురిటి ఖర్చులూ నీకు పెట్టె ప్రతీ పైసా దండగని ఊహించుకుంటూ నిన్ను కనడం ఖర్మంటూ నీ తమ్ముడికోసం కలలు కంటూ నిన్ను ఆరడిపెడుతూ వుంటే నోరు విప్పని నన్ను చూస్తే

Jan 16, 2012

స్నేహ కృష్ణ - శారదా అశోకవర్ధన్

కాలేజీకెళ్ళే వారందరికీ ఆమె తెలుసు ఆమె చదువుల తల్లి కనుక - కవితలల్లే వాళ్ళందరికీ ఆమె పరిచయమే కవయిత్రి కనుక - సహృదయులందరికీ ఆమెతో నెయ్యమే స్నేహశీలి గనుక -

Jan 16, 2012

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

కవితలల్లాను కన్నీళ్ళమీద! అవి, మానవ జీవితాల్లో మొలిచి హృదయంలో పూచిన గడ్డిపూలు! 'అమ్మ' అంటే నీకు అర్థం కాలేదా? అయితే విను-

Jan 15, 2012

మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ

చీకు చింతలేని చిరుత వయసును దలువ చిత్తమే పులకించు మనసా! బ్రతుకులో బంగారు ప్రాయమ్ము బాల్యమ్ము స్మృతులుగా పలికించు తెలుసా?

Jan 15, 2012

ముగ్గురమ్మల మూలపుటమ్మ - శారదా అశోకవర్ధన్

నవమాసాలు మోసి ఎంతో ప్రయాసకోర్చి జన్మనిస్తుంది కన్నతల్లి పొత్తిళ్లలో పొదివి పట్టుకుని గుండెలకి హత్తుకుంటూ స్తన్యమిచ్చి పెంచుతుంది తన బలాన్ని క్షీరధారగా మర్చి గోరుముద్దలు తినిపిస్తుంది

Jan 13, 2012