మామిడికాయ షర్బత్
కావలసినవి:
పచ్చి మామిడి కాయలు -3
పంచదార - ఒక కప్పు
జీలకర్ర పొడి - ఒక చెమ్చా
ఉప్పు - ఒక చెమ్చా
మంచి నీరు - రెండు కప్పులు
పుదీనా రసం - రెండు చెంచాలు
తయారీ విధానం:
ముందుగా మామిడి కాయలని రెండు కప్పుల నీరు పోసి కుక్కర్ లో పెట్టి 3 విసిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఆ తర్వాత కాయలలోని గుజ్జు తీసి, ఉడికించటానికి పోసిన నీటితో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమం లో పంచదార, ఉప్పు, పుదినా రసం వేసి స్టవ్ మీద పెట్టి పంచదార కరిగేదాకా సన్న మంటమీద తిప్పుతూ వుండాలి. పంచదార కరిగి రసం ఉడకటం మొదలుఅయ్యేదాకా ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి మామిడి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి . చల్లారాక జీలకర్రపొడి వేసి కలపాలి.. ఈ రసాన్ని ఒక గ్లాసు మంచి నీటిలో ఓ మూడు చెంచాలు వేస్తే చాలు. చల్లటి నీటితో కలుపుకుని, కొన్ని పుదినా ఆకులని అందులో వేసి తాగితే చాలా రుచిగా వుంటుంది. పచ్చి మామిడి రసం ఆరోగ్యానికి చాలా మంచిది .
-రమ
|