న్యూ ఇయర్ కేక్
కావలసిన పదార్ధాలు:
మైదా - నాలుగు కప్పులు
గుడ్లు - నాలుగు
వెనీలా ఎసెన్స్ - రెండు చెంచాలు
టూటీ ఫ్రూటీ - రెండు కప్పులు
కాండెడ్ పిల్ - రెండు కప్పులు
కిస్‌మిస్ - కొద్దిగా
జీడిపప్పు - తగినంత
వెన్న - ఒక కప్పు
కార్మేల్ కలర్ - రెండు చెంచాలు
చక్కెర - రెండు కప్పులు
బేకింగ్ పౌడర్ - రెండు చెంచాలు
తయారుచేసే పద్ధతి:
ముందు ఒక గిన్నె తీసుకొని అందులో వెన్న, చక్కెర వేసి బాగా మెత్తగా కలుపకోవాలి. ఇప్పుడు అందులో వెనీలా ఎసెన్స్, సన్నని ముక్కలుగా తరిగిన డ్రైఫ్రూట్స్, కార్మేల్ కలర్ వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. తరువాత కోడిగుడ్లను పగలగొట్టి తెల్ల సొనను వేరే గిన్నెలో తీసుకొని.. పసుపు సొనను ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమంలో కలపాలి. తెల్లసొనను ఎగ్ బీటర్‌తో తెల్ల నురుగు వచ్చే వరకు గిలకొట్టి... దీన్ని కూడా మిశ్రమంలో కలపాలి. ఇప్పుడు మైదాపిండి, బేకింగ్ పౌడర్ రెండింటిని కలిపి జల్లించి..ఆ పిండిని గుడ్లు కలిపిన మిశ్రమానికి చేర్చి మెల్లగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దానిని కుక్కర్ గిన్నె లేదా కేక్ ఒవెన్‌లో పోసి పైన జీడిపప్పు చల్లి ఇరవై నిమిషాలు బేక్ చెయ్యాలి. అంతే న్యూ ఇయర్ కేక్ నోరూరించేలా సిద్ధమవుతుంది. |