చింతకాయ, ఉల్లి చట్నీ
కావలసిన పదార్థాలు:
చింతకాయ పచ్చడి - 4 చెమ్చాలు
ఉల్లిపాయలు చిన్నవి - 2
పోపు కోసం ఆవాలు - 1 చెమ్చా
నూనె - 2 చెమ్చాలు
ఇంగువ - అర చెమ్చా
తయారీ విధానం:
ఒకసారి అనుకోకుండా చుట్టాలు వచ్చారు. దోశలు వేసి పెట్టాల్సివచ్చింది.చట్నీ చేద్దామంటే పల్లీలు అందుబాటులో లేవు.అప్పుడు ఈ చట్నీ చేశాను.. కాదు కనిపెట్టాను. చింతకాయ నిలవ పచ్చడి ఇంట్లో వుంది.దానిలో ఉల్లిపాయ వేసి మెత్తగా రుబ్బి, పైన ఆవాలు, ఇంగువతో పోపు పెట్టాను. ఉల్లిపాయ వేశాం కాబట్టి చట్నీ కొంచం జారుగా వస్తుంది.చింతకాయ పులుపు కలసి చాలా రుచిగా కూడా వచ్చింది.అప్పటికప్పుడు అయిపోయే చట్నీ. ఒట్టి ఉల్లిపాయ చట్నీ అంటే కొంచం ఘాటుగా వుంటుంది. కానీ ఈ చట్నీ పుల్లగా, రుచిగా వుంటుంది. దోశలకి రోజుకి ఒక చట్నీ చేయాలి కదా. ఈసారి ఈ చట్నీ ట్రై చేయండి.
-రమ
|