కంద బచ్చలి కూర!
కావలసినవి:
బచ్చలి కూర -2 కట్టలు
కంద - అరకేజీ
చింతపండు - కొద్దిగా
శెనగపప్పు- 1 టీస్పూ
మినప్పప్పు- 1 టీస్పూ
కరివేపాకు- 2 రెమ్మలు
ఉప్పు - సరిపడా
ఆవాలు - 4 టీస్పూ
నూనె - 4 టీస్పూ
పచ్చిమిర్చి - 4
ఎండుమిర్చి- 4
తయారు చేయు విధానం :
ముందుగా కంద చెక్కు తీసి చిన్నముక్కలుగా కోసుకోవాలి. బచ్చలి కూరని సన్నగా తరగాలి.రెండింటినీ శుభ్రంగా కడిగి పసుపు వేసి కుక్కర్‌లో ఉడికించి దించి, చిల్లుల పళ్లెంలో వేసి నీరు పిండాలి.చింతపండును కొంచెం నీళ్లల్లో నానబెట్టి గుజ్జు తీయాలి. ఆవాలను మెత్తగా నూరి ఉంచాలి.బాణెలి లో నూనె వేసి కాగాక శెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ముక్కలు వేయాలి.అవి ఎర్రగా అయ్యాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆపై ఉడికించిన కూరను అందులో వేసి చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలిపి అయిదు నిమిషాలు ఉడికించి ఆవాల ముద్దను వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేడి వేడి రైస్ తో సర్వ్ చేసుకోవాలి.
|