దహీ బ్రెడ్‌ వడ!
Author : Teluguone
Preparation Time : 25 Minutes
Cooking Time : 20 Minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : January 19, 2024
Recipe Category : Appetizers
Recipe Type : Break Fast
Total Time : 45 Minutes
Ingredient : Dahi Bread Vada
Description:

Dahi Bread Vada

Recipe of దహీ బ్రెడ్‌ వడ!

Dahi Bread Vada

Directions | How to make  దహీ బ్రెడ్‌ వడ!

 

దహీ బ్రెడ్‌ వడ!

 

 

 

కావలసిన పదార్థాలు:


బ్రెడ్‌ ప్యాకెట్‌ - ఒకటి

పెరుగు - అరలీటరు

నూనె - సరిపడా

పచ్చిమిర్చి - నాలుగు

అల్లం - చిన్నముక్క

ఉప్పు - తగినంత

జీలకర్రపొడి - అరటీస్పూను

కారం - అరటీస్పూను

 

తయారుచేసే విధానం:

ముందుగా బ్రెడ్‌ ముక్కలను మెత్తగా చేసుకుని కొద్దిగా నీళ్లు వేసి తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముద్దలా కలపాలి.

తరువాత  స్టవ్ వెలిగించి బాణలి  పెట్టి అందులో నూనె పోసి కాగాక బ్రెడ్‌ మిశ్రమం ను చిన్నచిన్న ఉండలు తీసుకుని  వడలుగా వత్తిన నూనెలో వేసి వేయించి బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి తీసుకోవాలి.

తరువాత పెరుగు బాగా చిలికి ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసి కలిపి వేయించిన వడను పెరుగులో వేసి కాసేపు నానాక సర్వ్ చేసుకోవాలి...