క్యాప్సికం చికెన్
కావలసినవి :
బోన్లెస్ చికెన్ ముక్కలు - అరకేజీ
క్యాప్సికం - 2
కొత్తిమీర - 1 కట్ట
నిమ్మ రసం - ఒక స్పూన్
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 1
పచ్చి మిర్చి- 5
చిల్లి సాస్ - రెండు స్పూన్లు
సోయా సాస్ - రెండు స్పూన్లు
కారం - రెండు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 10
ఆయిల్ - సరిపడా
కార్న్ ఫ్లోర్ - ఒక స్పూన్
మైదా - ఒక స్పూన్
వైట్ పెప్పర్ - కొద్దిగా
అజినోమోటో - చిటికెడు
తయారీ :
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాప్సికం ముక్కలను సన్నగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ మైదా , 1 స్పూన్ మైదా, అర స్పూన్ సోయా సాస్, తగినంత కారం, ఉప్పు, 1 స్పూన్ వైట్ పెప్పర్, చిటికెడు అజినోమోటో, కలర్ ,1 స్పూన్ నిమ్మరసం,గిలకొట్టిన కోడి గ్రుడ్డు ను వేసి పేస్టు లాగ కలుపుకుని చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక అందులో చికెన్ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ మాత్రమే ఉంచి అందులో కాప్సికం ముక్కలు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసి అందులో ఒక స్పూన్ చిల్లి సాస్, అర స్పూన్, సోయ్ సాస్, చిటికెడు అజినోమోటో , తగినంత ఉప్పు, కారం, ఒక స్పూన్ వైట్ పెప్పర్ కలపాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో చికెన్ ముక్కలను వేసి ఒక పది నిముషాలు ఉడకనివ్వాలి. నీళ్ళు అన్ని ఆవిరి అయ్యాక చివరిలో కాప్సికం ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిరతో గార్నిష్ చేసుకోవాలి
|