నిజాం వెజిటేరియన్ బిర్యానీ
కావాల్సిన పదార్థాలు :
బాస్మతి రైస్ - కేజీ
బీన్స్ - ఒక కప్పు
క్యారట్ - మూడు
పెరుగు - ఒక కప్పు
ఆయిల్ - సరిపడా
ధనియాల పౌడర్ - ఒక స్పూన్
పసుపు - కొద్దిగా
వెన్న- ఒక కప్పు
కారం - రెండు స్పూన్లు
గరం మసాలా పౌడర్ - ఒక స్పూన్
మరాటీ మొగ్గ - రెండు
అనాస పువ్వు - రెండు
ఇలాచి - నాలుగు
జీడిపప్పు - ఇరవై
పుదీనా - ఒక కప్పు ( కట్ చేసినది )
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు ( పొడవుగా కట్ చేసి వేయించనవి )
లెమన్ జ్యూస్ - రెండు స్పూన్ల
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్ల
కొతిమిర - అర కప్పు ( కట్ చేసినది )
ఉప్పు - తగినంత
కుంకుమపువ్వు- చిటికెడు
పచ్చిమిర్చి- పది
తయారీ :
ముందుగా బాసుమతి రైస్ ని కడిగి నానపెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన బీన్స్, క్యారట్ కి లెమన్ జ్యూస్,అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు, తరిగిన కొత్తిమిర, పుదీనా, ధనియాలపౌడర్, ఆయిల్‌ను కలిపి అరగంట సేపు నానబెట్టాలి. తరువాత అయిదు లీటర్ల నీటిని తీసుకుని అందులో మరాటి మొగ్గ, ఇలాచి, అనాస పువ్వు , కొద్దిగా గరం మసాలా వేసి బాగా మరగించి తరువాత నానబెట్టిన బాస్మతి రైస్ ని వెయ్యాలి. ఈ రైస్‌ని తీసుకుని నానబెట్టిన క్యారట్ మసాలా మిశ్రమంపై బాస్మతి రైస్‌ని వేసి పైన వెన్నను కలపాలి.ఈ కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో ఉంచి ఆ గిన్నెకు సరిపడా గోధుమ పిండిని చపాతీ పిండిలా కలిపి ఆ పిండితో గిన్నె ఆ గిన్నె పై భాగం మొత్తం కవర్ చేసి స్టవ్ పై పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఆ మూత మీద నిప్పులు వేసి 20 నిమిషాలు ఉంచి బిర్యానీ దమ్ చెయ్యాలి. ఇప్పుడు మూత తీసి బిర్యానీకి తరిగిన కొతిమిర, పుదీనా, వేయించిన జీడిపప్పు,వేయించిన ఉల్లిపాయలు వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి...
|