షాహి మష్రూమ్ బిర్యాని
కావల్సినవి:
బాస్మతి బియ్యం : పావుకేజీ
లవంగాలు : 4
ఏలకులు : 2
మిరియాల : 4
నెయ్యి : నాలుగు స్పూన్లు
ఉప్పు: సరిపడా
కర్రీ మసాలా కోసం :
కొత్తిమీర తరుగు : కొద్దిగా
జీడిపప్పు : 5- 6
నూనె : తగినంత
లవంగాలు : 2
మిరియాల : 4
మష్రూమ్స్ : 200 గ్రాములు
ధనియాలా పొడి : రెండు స్పూన్లు
కారం: ఒక స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : అర స్పూన్
కుంకుమ పువ్వు: 1స్పూన్
బ్లాక్ ఇలాచీ : 2
దాల్చిన చెక్క : 1 అంగుళం
ఉల్లిపాయ: 1
పచ్చి మిరపకాయలు : 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
రైస్ తయారుచేసుకొనే విధానం :
ముందుగా బియ్యం కడిగి పాన్ లో వేసి అందులో లవంగాలు , బ్లాక్ ఏలకులు నల్ల మిరియాలు వేసి వేయించాలి 4 కప్పుల నీళ్ళు, ఉప్పు వేసి అన్నం మూడు వంతులు ఉడికేంత వరకూ ఉడికించుకుని స్టౌ మీద నుండి తీసి పక్కన పెట్టుకోవాలి.
మసాలా కోసం:
మష్రూమ్స్ ను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి లవంగాలు , నల్ల మిరియాలు, మరియు దాల్చిన చెక్కా వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ధనియాల పొడి, కారం, ఉప్పు , పసుపు వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత మష్రూమ్స్ వేసి పాన్ మూత పెట్టి ఉడికించాలి . ఇప్పుడు నీరంతా పూర్తిగా ఇగిరిపోయాక కొత్తిమీర వేసి స్టవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ లో వండిన రైస్ ను లేయర్ గా వేసి దాని మీద కర్రీ ని ఒక లేయర్ గా వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రోసెస్ రిపీట్ చేసి పాన్ ను స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించి ఒక పది నిముషాలు ఉడికించుకోవాలి. పాలల్లో కుంకుమ పువ్వును నానపెట్టుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ పై గిన్నె పెట్టి నెయ్యి వేసి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , జీడిపప్పు వేసి వేయించి రైస్ ఉడికాక వీటితో గార్నిష్ చేసుకుని పైన కుంకుమ పువ్వు వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
|