ఆంధ్రా మాగాయ పచ్చడి
కావలసినవి:
పచ్చి మామిడి కాయలు - 10
కారం పొడి - పావుకేజీ
ఆవాలు - 100 గ్రాములు
మెంతులు - 100 గ్రాములు
నూనె - 200 గ్రాములు
ఉప్పు - 250 గ్రాములు
ఇంగువ - అర స్పూన్
ఎండుమిరపకాయలు - రెండు
తయారీ:
ముందుగా మామిడి కాయల తొక్క తీసేసి నిలువుగా సన్నని ముక్కలు కోయాలి.వాటికి ఉప్పు కలిపి, నాలుగు రోజులు పాటు ఎండ లో బాగా ఎండనివ్వాలి. ఎండిన మామిడికాయ ముక్కలకు కారం, ఆవాలు, మెంతులు వేయించి పొడిగా గ్రైండ్ చేసి కలపాలి.తర్వాత స్టవ్ వెలిగించి గిన్నెతీసుకుని అందులో నూనె వేసి వేడి చేసి దానికి ఇంగువ పొడిని చేర్చి కొద్దిగా ఆవాలు, రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి నూనె బాగా చల్లారాక గ్రైండ్ చేసుకున్న మామిడి కాయ ముక్కలలో తాలింపు కలిపి ఒక రోజు నిలువ ఉంచి తరువాత రోజూ నుంచి వాడుకోవచ్చు..
|