మాంగో పులవ్
కావలసినవి:
బాస్మతి రైస్ - కేజీ
పచ్చిమామిడి తురుము - ఒక కప్పు
యాలకులు - 4, లవంగాలు - 4
పసుపు - 1 స్ఫూన్
జీలకర్ర - స్ఫూన్
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - సరిపడా
మిరియాలు - 6
నెయ్యి - 4 స్ఫూన్లు
దాల్చినచెక్క- చిన్న ముక్క
పచ్చిమిర్చి - మూడు
తయారీ:
ముందుగా బాస్మతి బియ్యం కడిగి నానపెట్టుకోవాలి. తరువాత ప్రెజర్ కుక్కర్‌లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం తురుము వేసి వేగాక అందులోనే పచ్చిమామిడి తురుము వేసి తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. అందులోనే పసుపు ఉప్పు వేసి వేయించి, సరిపడా నీళ్లు పోసి మరిగించి ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా మిక్స్ చేసి గరం మసాలా పౌడర్ వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి...
|