పంజాబీ స్టైల్ స్వీట్ మాంగో చట్నీ
కావలసినవి:
పచ్చి మామిడి కాయలు పెద్దవి - రెండు
ఆవనూనె - మూడు నాలుగు స్పూన్లు
మెంతులు మూడు స్పూన్లు
పసుపు - రెండు స్పూన్లు
కారం - మూడు స్పూన్లు
నల్ల మిరియాల పొడి - రెండు స్పూన్లు
జీలకర్ర - నాలుగు స్పూన్లు
బెల్లం - 150 గ్రాములు
సాల్ట్ - ఐదు స్పూన్లు
తయారీ :
ముందుగా మామిడి కాయలను కడిగి శుభ్రంగా తుడిచి ఆరాక తొక్కతీసి తురుముకుని అందులో మూడు స్పూన్ల ఉప్పు,కొద్దిగా పసుపు వేసి ఆరుగంటల పాటు ఆరనివ్వాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని బాగా వేడయ్యాక ఆయిల్ వేసి జీలకర్ర, మెంతులు వేసి కొద్దిసేపు వేగాక అందులో మామిడికాయ తురుము వేసుకుని, వేగాక, బెల్లం తురుము , పంచదార వేసుకుని బాగా కలిపి అందులో సాల్ట్ వేసుకోవాలి. తరువాత కారం మిరియాల పొడి వేసి బాగా కలిపి కొంచంసేపు ఉడికించాలి. ఒక పదినిముషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారక ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.
|