పచ్చి మామిడికాయ జ్యూస్
కావలసినవి :
పచ్చి మామిడికాయలు - అర కిలో
నల్ల ఉప్పు - ఒకటిన్నర స్పూన్
జీలకర్ర పౌడర్ - ఒక స్పూన్
పంచదార - తగినంత
చాట్ మసాల - ఒక చెంచా
వాటర్ - లీటర్
తయారీ :
ముందుగా మామిడికాయలు కడిగి ముక్కలు తరిగి పెట్టుకొవాలి. స్టవ్ వెలిగించి పాన్ లో నీళ్ళు పోసి అందులో ఈ మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికాక అవి ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారక మిక్సిలో వేసి పేస్ట్ లా చేసి కొద్దిగా నీళ్ళు కలిపి వడ కట్టి రసాన్ని తీసుకోవాలి. ఈ రసానికి సరిపడా నీళ్ళు పోసి కలిపి అందులో నల్ల ఉప్పు, జీరా పౌడర్ , పంచదార , చాట్ మసాల వేసి బాగా కలిపి గంటసేపు ఫ్రిజ్ లో పెట్టుకుని తరువాత సర్వ్ చేసుకోవాలి.. |